Advertisement

ఏపీలో ఏం జరుగుతుంది?


జూన్ 4 న కూటమి విజయ కేతనం ఎగుర వేసి జూన్ 12 న చంద్రబాబు సీఎం గా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అంగరంగ వైభవంగా  పదవులు చేపట్టారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పులు తాము చెయ్యమని చెబుతూనే వారు చేసిన తప్పిదాలను వెలికి తీస్తూ కొంతమంది బిజీగా ఉంటే చంద్రబాబు, పవన్ లోకేష్ లు ప్రజా పాలనపై దృష్టి పెట్టారు. 

Advertisement

టీడీపీ నేతలు, జనసేన నేతలు కొంతమంది జగన్ ప్రభుత్వంలో తమని ఇబ్బంది పెట్టినవారిని వదిలేలా కనిపించడం లేదు. వారి మీద రివెంజ్ తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. మాజీ మంత్రుల అవినీతిని వెలికి తీసే పనిలో కొంతమంది, తమకి ఎదురొచ్చినవారిని మట్టుబెట్టే క్రమంలో మరికొంతమంది ఉన్నారు. తాజాగా వినుకొండలో వైసీపీ నేతల మద్యన ఘర్షణ జరిగిందో, లేదంటే వైసీపీ vs టీడీపీ మధ్యన ఘర్షణ జరిగిందో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. 

అది టీడీపీ వాళ్ళు చేసిందే అని వైసీపీ ఆరోపిస్తుంటే.. కాదు వైసీపీ కార్యకర్తల్లోనే ఘర్షణ పడి వైసీపీ కార్య కర్త, మరో వైసీపీ కార్యకర్తని హత్య చేసారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఇంతలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా హత్య గురైన కుటుంబాన్నిఆదుకుంటామంటూ ట్వీట్ చేసారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు.  ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని  ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి మంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్క్షప్తిచేస్తున్నాను. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. 

వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. అంటూ జగన్ ట్వీట్ చేసారు. 

Jagan:

AP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement