పుష్ప 2 షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు విదేశాలకి చెక్కేసాడు, హీరో వెకేషన్ కి వెళ్ళిపోయాడు. దానితో పుష్ప 2 డిసెంబర్ నుంచి కూడా పోస్ట్ పోన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అందుకే మేకర్స్ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పుష్ప 2 ని డిసెంబర్ లో కాకపోతే మార్చ్ లో విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 ని డిసెంబర్ లోనే విడుదల చెయ్యాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. కానీ హీరో-దర్శకుడు మధ్యన ఉన్న క్లాష్ ఎప్పటికి తీరాలి, ఎప్పుడు షూటింగ్ ఫినిష్ చెయ్యాలో అర్ధం కాక నిర్మాతలు మధ్యలో నలిగిపోతున్నారట. మరి ఈ సమస్య ఎప్పటికి తీరేనో అని మిగతా టెక్నీకల్ టీమ్ తో పాటుగా నటులు కూడా ఎదురు చూస్తున్నారట.
మరి ఆగష్టు 15న రిలీజ్ సాధ్యం కాదు అని డిసెంబెర్ 6 కి షిఫ్ట్ అయిన పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ నుంచి మార్చ్ కి వెళితే పరిస్థితి ఏమిటో.. సినిమాపై అసలు క్రేజ్ ఉంటుందా అని అల్లు ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు.