గత 20 ఏళ్లుగా ఎన్నికల్లో గెలుస్తూ హీరోలా చక్రం తిప్పిన కొడాలి నానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగడుగునా చుక్కలు చూపించడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే రెండు మూడు కేసులు కొడాలి పై పెట్టారు. అందులో వాలంటీర్ల కేసు నుంచి కొడాలికి ఊరట లభించింది. మరోపక్క కొడాలి నాని అండతో అతని అనుచరులు ఆక్రమించిన స్థలాలు, భూములను ఇప్పుడు ఎమ్యెల్యే రాము సహాయంతో తిరిగి దక్కించుకుంటున్నారు కొందరు.
నా వెంట్రుక కానీ, జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవ్వడు పీకలేరు అన్న నాని కి గుండు చెయ్యడానికి ఎంతోమంది రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రజల నుంచి తిరస్కరణ రూపం లో ఓటమి పాలయిన నాని కి ఇప్పుడు అతను కొమ్ములు వంచేందుకు రంగం సిద్దమైంది. నిన్న మంగళవారం కొడాలి నాని, అతని అనుచరులకి అడ్డాగా మారిన కృష్ణాజిల్లా గుడివాడలోని శరత్ థియేటర్ లో టీడీపీ కార్యకర్తలతో టీడీపీ నేతలు మీటింగ్ పెట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన తేనీటి విందులో లోకేష్ పాల్గొన్నాడు. ఆ శరత్ థియేటర్ గతంలో టీడీపీ నాయకుడిది. ఆ థియేటర్ నిన్నటివరకు కొడాలి నానిదే అనుకున్నారు చాలామంది.
కానీ కొడాలి నాని అనుచరులు దానిని కబ్జా చేసి తమ అడ్డాగా మార్చుకున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ కార్యాలయంగా ఆ థియేటర్ ని మార్చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ని యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. అందులో భాగంగా వైసీపీ ప్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలను యాజమాన్యం తీసిపారేసింది.
గుడివాడలో ఇన్నాళ్లూ అరాచకానికి అడ్డాగా ఈ థియేటర్ అంటే వైసీపీ కార్యాలయం ఉండేది. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేయటం జరిగింది. మేం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కుదారులకు అప్పగించటం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పనిచేస్తుంది. ప్రజల డబ్బు కోసం ఆశపడే వాళ్లెవరూ టీడీపీ పార్టీలో లేరని.. అంటూ తేనీటి విందులో పాల్గొన్న గుడివాడ ఎమ్యెల్యే వెనిగండ్ల రాము మాట్లాడారు. మరి ఈలెక్కన కొడాలి నానికి కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నట్టేగా.!