Advertisement
Google Ads BL

కార్తీ సర్దార్ 2 సెట్స్ లో ప్రమాదం..


కోలీవుడ్ హీరో కార్తీకి ఖైదీ తర్వాత అంతటి బ్రేకిచ్చిన మూవీ సర్దార్. అండర్ కవర్ ఏజెంట్ గా కార్తీ అదిరిపోయే గెటప్స్ తో ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు.. ఆ చిత్రం తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్ 2 మూవీ ని మొదలు పెట్టాడు. రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సర్దార్ 2 సెట్స్ లో ప్రమాదం జరిగినట్టుగా కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో న్యూస్ వైరల్ గా మారింది. చెన్నై లో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో సర్దార్ 2 యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుపుతుండగా.. స్టెంట్ మ్యాన్ ఎజుమలై 20 అడుగుల ఎత్తునుంచి దూకే క్రమంలో కిందపడి  ప్రమాదానికి గురై మరణించినట్లుగా చెబుతున్నారు.  

అంతేకాకుండా మరో ఇద్దరు స్టెంట్ మాస్టర్స్ కూడా గాయపడినట్లుగా సమాచారం అందుతుంది. ప్రమాదం జరగగానే ఎజుమలై ని మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా ఎజుమలై మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్తీ కూడా సర్దార్ సెట్స్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎజుమలై మరణంతో తమిళ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

Stuntman Dies In The Sets Of Sardar 2:

Sardar 2: Stentman Ezumalai died while jumping from a height of 20 feet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs