రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసి అనంత్ అంబానీ పెళ్ళికి హాజరయ్యాడు. భార్య ఉపాసనతో కలిసి రెండురోజుల పాటు ముంబై లోనే మకాం వేసిన రామ్ చరణ్ ఇకపై బుచ్చిబాబు మూవీ RC 16 కోసం మేకోవర్ అవ్వాల్సి ఉంది. ఆగష్టు నుంచి బుచ్చి బాబు RC16 పట్టాలెక్కించేపనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై సరైన అప్ డేట్ ఇవ్వకుండా దర్శకుడు శంకర్ మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. అందుకే గేమ్ చేంజర్ షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడ సెట్స్ నుంచి లీకులు బెడద మేకర్స్ ని పట్టిపీడిస్తుంది. ఇప్పటికి గేమ్ చెంజర్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా నానుస్తున్న శంకర్ కి మెగా ఫ్యాన్స్ ఇలా లీకులతో చాలాసార్లు షాకిస్తున్నారు. రామ్ చరణ్ సెకండ్ గెటప్ దగ్గర నుంచి అంజలి గెటప్ వరకు, వైజాగ్ షెడ్యూల్ నుంచి లీకులు ఇలా ఎన్నోసార్లు గేమ్ చేంజర్ సీన్స్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఇప్పుడు కూడా శంకర్, చరణ్ పై ఎయిర్ పోర్ట్ లో ఓ క్రేజీ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్టు గా ఓ వీడియో లీకైంది. ఇది చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎగ్జైట్ అవుతున్నారు. కొంతమంది కావాలని మేకర్స్ లీకిస్తున్నారు అంటుంటే.. మరికొందరు మాత్రం గేమ్ చేంజర్ నుంచి సరైన అప్ డేట్ రాకపోతే ఇలాంటి లీకులే బయటికి వస్తాయంటూ కామెంట్ చేస్తున్నారు.