Advertisement

కల్కి కోసం వెయిట్ చెయ్యాల్సిందే!


కొన్నాళ్లుగా ఏ సినిమా విడుదలైనా అది నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రావడం చూస్తున్నాం. భారీ బడ్జెట్ అయినా, మీడియం సినిమాలైనా కేవలం నాలుగు వారాల్లోనే థియేటర్స్ నుంచి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సలార్, గుంటూరు కారం ఇవన్నీ నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అందుకే ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కల్కి కూడా జూన్ 27 న విడుదలైంది. నాలుగు వారాల్లోపే ఓటీటీ కి వస్తుంది అనుకున్నారు. 

Advertisement

అంటే జులై చివరి వారం కానీ.. ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా కానీ స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ కాచుకుని కూర్చున్నారు. కల్కి ఓటీటీ నార్త్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా..  సౌత్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ డీల్ తో కొనుగోలు చేసారు. అంటే ఒకేసారి ఈ చిత్రం రెండు ఓటీటీలలో అందుబాటులోకి వస్తుంది. 

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం కల్కి చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే పది వారాలు వెయిట్ చెయ్యాల్సిందే అంటున్నారు. మరి ఈ లెక్కన థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల 10 రోజులు వరకు కల్కి ని ఓటిటి లో వీక్షించడం కుదరదు. థియేటర్స్ 1000 కోట్లు కొల్లగొట్టిన కల్కి ని చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నా దాని కోసం సెప్టెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. 

Have to wait for Kalki!:

Kalki 2898 AD OTT release: Fans will have to wait till September
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement