Advertisement
Google Ads BL

మాల్వీ మల్హోత్రా అడ్డంగా బుక్కయింది


యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రాల ముక్కోణపు ప్రేమ కథ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఈ ముక్కోణపు ప్రేమకథలో ఇప్పటి వరకు ఎవరిది రాంగ్ అనే విషయంలో రోజుకొకరు తప్పు చేసినట్లుగా అనిపిస్తూ వస్తుండగా.. ఇప్పుడసలు సిసలైన ట్విస్ట్ ఈ ప్రేమకథలో బయటికి వచ్చింది. ఈ ట్విస్ట్‌తో రాజ్ తరుణ్ ప్రియురాలిగా చెప్పుకుంటున్న మాల్వీ మల్హోత్రా అడ్డంగా బుక్కయినట్లుగా టాక్ వినబడుతోంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం లావణ్య ఆరోపణలు చేస్తున్న మాల్వీ మల్హోత్రా.. ఇంతకు ముందు కూడా ఓ వ్యక్తిని రోడ్డుపై లాగిందని, జైలుపాలు చేసిందనేలా ఓ వార్త బయటికి రావడంతో అంతా అవాక్కవుతున్నారు. ముంబైకి చెందిన నిర్మాత యోగేశ్‌ను కూడా మాల్వీ మల్హోత్రా ఇలాగే ప్రేమ పేరుతో మోసం చేసి, తనని, తన కుటుంబాన్ని ఇంకా వేధిస్తూనే ఉందని, యోగేశ్ తల్లి మీడియా ముందుకు రావడంతో.. ఒక్కసారిగా ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా, అంతే ఆసక్తికరంగా మారింది. 

యోగేశ్ తల్లి చెబుతున్న ప్రకారం మాల్వీ మల్హోత్రా.. తన కుమారుడు యోగేశ్ ప్రేమించుకుని, ఇద్దరూ రెండేళ్ల పాటు సహజీవనం చేశారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో.. యోగేశ్ తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనీ, కత్తితో తనపై దాడి చేసి చంపబోయాడని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చి, యోగేశ్‌ని మాల్వీ మల్హోత్రా అరెస్ట్ చేయించిందని యోగేశ్ తల్లి చెప్పుకొచ్చింది. ఇది జరిగి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా తమ కుటుంబాన్ని ఆమె ఇబ్బందులు పెడుతూనే ఉందని యోగేశ్ తల్లి చెప్పిన సమాచారంతో.. రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రాల కేసు మరో కొత్త ట్విస్ట్‌ని జనాలకు పరిచయం చేసింది. ఫైనల్‌గా ఏమవుతుందో తెలియదు కానీ.. రోజుకో ట్విస్ట్ అన్నట్లుగా ఈ ప్రేమగాధ ప్రయాణం చేస్తుండటం విశేషం.

Raj Tarun Case: Heroine Malvi Malhotra in Big Trouble:

Malvi Malhotra Character Gives Big Twist in Raj Tarun Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs