Advertisement
Google Ads BL

కిరణ్ ‘క’ టీజర్.. ఇంట్రస్టింగ్


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా.. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న నూతన చిత్రం ‘క’ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ‘క’ టైటిల్ పోస్టర్ వదిలి.. అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన మేకర్స్.. సోమవారం వదిలిన ‘క’ టీజర్‌తో సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగేలా చేశారు. ఎందుకంటే.. ఈ టీజర్ అలా ఉంది. కిరణ్ అబ్బవరం ఇంతకు ముందు కనిపించని కొత్త అవతార్‌తో ఇందులో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన పోస్ట్‌మాన్‌గా కనిపించినా.. అపరిచితుడు మాదిరి.. అతనిలో ఇంకొకరు ఉన్నట్లుగా.. ఈ టీజర్ తెలియజేస్తుంది.

Advertisement
CJ Advs

‘క’ అనేదానికి అర్థం ఏమిటనేది పక్కన పెడితే.. టీజర్ మాత్రం ఇదొక కంటెంట్ బేస్డ్ సినిమా అని మాత్రం తెలియజేస్తుంది. స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టిన తీరు, డైలాగ్స్, కిరణ్ అబ్బవరం మేకోవర్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ మధ్య వరుస ఫ్లాప్స్‌తో ఉన్న కిరణ్ అబ్బవరం.. ఈ సినిమాతో మాంచి హిట్ కొట్టబోతున్నాడనే ఫీల్‌ని అయితే ఈ టీజర్ ఇస్తోంది. 

పీరియాడిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో త్వరలోనే గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Kiran Abbavaram Starring Ka Movie Teaser Out :

Kiran Abbavaram Starring Ka Movie Teaser Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs