Advertisement
Google Ads BL

‘కన్నప్ప’ నాథనాధుడి లుక్


మంచు విష్ణు హీరోగా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై భారీగా అంచనాలను నెలకొల్పగా.. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శరత్ కుమార్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Advertisement
CJ Advs

తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ పుట్టినరోజు నేడు (జూలై 14). ఈ సందర్భంగా కన్నప్ప నుంచి ఆయన క్యారెక్టర్ పాత్రను విడుదల చేశారు. కన్నప్పలో శరత్ కుమార్ నాథనాధుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కన్నప్ప మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే.. ఇందులో శరత్ కుమార్ పాత్ర చాలా కీలకం అనేది అర్థమవుతోంది.

మరీ ముఖ్యంగా ఈ పిక్‌‌ను చూస్తుంటే శరత్ కుమార్ వీరోచిత పాత్రను ఇందులో చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని శరత్ కుమార్ లుక్‌ని తలపిస్తున్నప్పటికీ.. ఇందులో ఆయన మేకోవర్ మాత్రం కాస్త డిఫరెంట్‌గానే అనిపిస్తోంది. శరత్ కుమార్‌తో పాటు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తోన్న ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sarathkumar As Nathanadhudu in Kannappa:

Sarathkumar Birthday Special His look in Kannappa Revealed <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs