Advertisement
Google Ads BL

ఎన్నో వేడుకల్లో దైవబలాన్నిస్తున్న పురాణపండ ‘శ్రీ సహస్రం’కు జేజేలు


ఆర్ష గ్రంధాల గొప్పదనమేంటో అద్భుతంగా ఆవిష్కరించే ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) రచనా సంకలనాలగురించి క్రొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎక్కడా భేషజాలు, సొంత డబ్బాలు లేకుండా దైవ బలానికి ప్రాధాన్యత ఇస్తూ సుమారు పదిహేనేళ్లుగా అపూర్వ రీతిలో పురాణపండ శ్రీనివాస్ రచించి ప్రచురిస్తున్న ధార్మిక గ్రంధాలను చూడగానే ఒక ఆత్మ విశ్వాసం, మనశ్శాంతి  కలుగుతాయని పండిత, పామర, మేధో సమాజం ఖఛ్చితంగా నిజాయితీగా చెప్పే, చెబుతున్న సత్యం.

Advertisement
CJ Advs

పెద్ద తరాలవారు చదువుకునేందుకు, పారాయణ చేసుకునేందుకు వీలుగా, గొప్ప శబ్ద సౌందర్యంతో,  శిల్ప నిర్మాణాలతో, అర్ధ గాంభీర్యంతో, కవిత్వ సౌందర్యంతో, పరమాద్భుతమైన చిత్ర లావణ్యాలతో ప్రతీ గ్రంధాన్ని ఆకర్షణీయంగా అందించే పురాణపండ శ్రీనివాస్ ఒక మంగళతూర్యారావంగా అందించిన ‘శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, నన్నేలు నాస్వామి, ఉగ్రం.. వీరం, నేనున్నాను, మహా సౌందర్యం, మహా మంత్రస్య’ వంటి మహాగ్రంధాలను ఎన్నో కుటుంబాల వారు తమ గృహ ప్రవేశ ఉత్సవాలలో, వివాహ వేడుకల్లో శ్రీజ్ఞాపికగా అందించడం పట్ల ఎందరెందరో అభినందనలు వర్షిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో ‘జయం జయం’, నందమూరి బాలకృష్ణ సమర్పణలో ‘శరణు .. శరణు’, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో ‘మంత్రపేటిక’, దిల్ రాజు సమర్పణలో ‘శ్రీనివాసో విజయతే’, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో ‘అమ్మణ్ణి’.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అక్షరపరిమళాలు జంటనగరాల ఆలయాల భక్త జనానికి అందుతూనే వున్నాయనడం కనులముందు కనిపించే సత్యం.

నిజంగా ఈ రోజుల్లో ఇంత పెద్ద అపురూపమైన ధార్మిక గ్రంధాలకు ఇంత ఖర్చు భరించి ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్న దాతల్ని ప్రశ్నిస్తే పురాణపండ శ్రీనివాస్‌లో మొదట మనకి గొప్ప యజ్ఞభావనతో కూడిన నిస్వార్ధ సేవ కనిపిస్తుందని, తరవాత విషయానికి వస్తే శ్రీపూర్ణిమ ఏడువందల యాభైపేజీల మహాగ్రంధం యొక్క లావణ్యం వర్ణించలేమని బాహాటంగా చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలలో సుమారు పాతిక ముద్రణలకు నోచుకున్న ఈ అద్భుతమైన అమోఘ గ్రంధం యొక్క క్వాలిటీ, సమర్పణా బుద్ధి,  సూపర్ కంటెంట్, రేర్ ఫొటోస్ మనల్ని కట్టేస్తాయని ప్రచురణకర్తలు పొగడ్తలు వర్షిస్తున్నారు. ఇంతటి అఖండ గ్రంధాన్ని కూడా అధిక సంఖ్యలో  పాఠక భక్తజనానికి  ఇవ్వడంలో పురాణపండ శ్రీనివాస్ వెనుక ఉన్న వేంకటాచల క్షేత్ర చైతన్యమే కారణమని, ఆయన ఆత్మబలాన్ని మెచ్చుకుని తీరాలని.. కేవలం సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా కొందరు న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు సైతం అభినందించడం దైవ సంకల్పం. దీని వెనుక ప్రముఖ పారిశ్రామిక వేత్త, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) కృషి ఎంతో ఉందన్నది కాదనలేని వాస్తవం. (Gnana Maha Yagna Kendram)                          

శరత్కాల బింబంలాంటి ఉత్తమోత్తమ రామణీయకత్వంతో పరమ సంపన్నంగా తిరుమల అలమేల్మంగమ్మ దివ్య చిత్రంతో శోభిస్తున్న శ్రీపూర్ణిమ బుక్ తెరిస్తే చివరిపేజీ వరకూ మనం పేజీలు తిప్పుతూనే ఉంటాం. ఏదో ఒక రహస్యమయ మన్త్ర శక్తి ఋషుల అనుగ్రహమై ఈ గ్రంథమంతటా దర్శనమివ్వటమే ఈ అపురూప గ్రంథ వైభవానికి కారణం. పురాణపండ శ్రీనివాస్ సాహిత్య, ఆధ్యాత్మిక జీవన వైభవంలో ఈ ‘శ్రీపూర్ణిమ’ గ్రంధం ఒక మణిస్తంభం అని ప్రశంసించక తప్పదు. ఇది నిజం కూడా.

ఇక పోతే.. ఇటీవల తిరుమల వేంకటాద్రి, విజయవాడ ఇంద్రకీలాద్రి, శ్రీ లక్ష్మీ నృసింహుని యాదాద్రిలో మాత్రమే కాకుండా చెన్నైలోని ప్రపంచ తెలుగు సమాఖ్య, రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయస్వామి వారి సన్నిధానం (Sri Uma Markandeya Swamy Temple)లో గత వారం రోజులుగా శ్రీనివాస్ వినూత్న రీతిలో సుమారు మూడువందల పేజీలతో అందించిన ‘శ్రీ లలితా విష్ణు సహస్ర నామ స్తోత్రమ్’ (Sri Lalitha Vishnu Sahasranamam Book) అనబడే ఒకే గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ దేవాలయ బోనాల ప్రధాన అర్చకులు రామతీర్ధ శర్మ, రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Rajahmundry Chamber of Commerce) పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ (Ashok Kumar Jain) తదితర ప్రముఖులు ఆవిష్కరించడం విశేషం.

భారతీయ సనాతన ధర్మంలోని మంత్ర శాస్త్రంలో పుష్కలంగా ఉన్న కొన్ని ప్రధానాంశాలతో, మరికొన్ని స్తోత్ర విద్యలతో, ఇంకొన్ని అందమైన వ్యాఖ్యానాలతో సుమారు మూడు వందల పేజీల శ్రీ సంపదగా ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్ర వైభవం’ను అందడం భక్తులకు పరమ ప్రయోజనకరంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ చైర్మన్ ఆకెళ్ళ విభీషణ శర్మ పేర్కొనడం ప్రత్యేకంగా పేర్కొనాలి.

మృత్యు భయాన్ని దూరం చేసేందుకై కాలానికి అధినాయకుడైన యముని ప్రార్ధన, ఆరోగ్యానికి అధి దేవతాశక్తి అయిన ధన్వంతరి ప్రార్ధనతో పాటు, పితృదేవతల ప్రసన్న ఆశీర్వచనం కోసం పితృదేవతాస్తోత్రరాజమ్, పంచ మహాయుధ స్తోత్రమ్‌తో పాటు కాశీ మహాక్షేత్ర ప్రార్ధన వంటి ఎన్నో విశిష్ట అంశాలతో ఈ బుక్ సుమారు వందకు పైగా పవిత్ర అంశాలతో విరాజిల్లడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పాల్సిందే. 

ఈ బుక్‌కి మార్కెటింగ్ కోసం విజయవాడకు చెందిన ఒక ప్రచురణా సంస్థ ప్రయత్నించగా వ్యాపార కాలుష్యంలోకి ఈ పవిత్ర గ్రంధాన్ని చేర్చ దలచుకోలేదని, భక్తులకు అందుబాటులో వుండే చాలా సామాన్యమైన ధరకు ఈ గ్రంధాన్ని అందించనున్నట్లు నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం. డబ్బు కోసమో, డాబు కోసమో, ధనికుల కోసమో, అధికుల కోసమో బుక్స్ అమ్ముకునే వ్యాపారాత్మక కనికట్టుల ఆత్మవంచనను పురాణపండ శ్రీనివాస్ తన దగ్గరకు చేరనివ్వలేదు కాబట్టే ఉత్తమ ప్రమాణాలతో ఆయన గ్రంధాలు దేశ దేశాల తెలుగు వారికీ అందుతున్నాయని నిర్మొహమాటంగా చెప్పేశారు బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు (EO KS Ramarao).

This Is the Greatness of Puranapanda Srinivas Sri Sahasram :

Legendary Writer Puranapanda Srinivas Book in Everywhere
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs