హ్యాట్రిక్ హిట్స్‌తో క్రేజీగా దూసుకుపోతున్న నందమూరి నటసింహ బాలకృష్ణ ఎన్నికలు పూర్తయ్యి.. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారు. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత బాలయ్య- బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రం చేస్తున్నారు. మహా శివరాత్రికి వదిలిన NBK 109 పవర్ ఫుల్ గ్లింప్స్‌కి నందమూరి అభిమానులు మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కూడా పూనకాలతో ఊగిపోయారు.
అయితే జూన్ 10 బాలయ్య బర్త్ డే రోజున NBK 109 టైటిల్ వదులుతారని ప్రచారం జరిగినా.. మేకర్స్ ఓ పవర్ పోస్టర్‌తో వదిలి.. టైటిల్ ప్రకటనను వాయిదా వేశారు. దానితో నందమూరి అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అంతకుముందే NBK 109కి వీర మాస్ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే టైటిల్ ట్రెండ్ అవుతుంది. అందుకే ఈ టైటిల్‌నే NBK109 కి పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.
మరి వీర మాస్ అంటే బాలయ్య కేరెక్టర్‌కి సరిగ్గా సరిపోతుంది. బాలయ్య కేరెక్టర్ సూపర్ పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఈ టైటిల్ పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలూ అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా చేస్తుండగా.. ఊర్వశి రౌతుల్లా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్‌తో పాటు అసురుడు, డిమోన్ అనే టైటిల్స్ కూడా బాగా ప్రచారమయ్యాయి.