Advertisement
Google Ads BL

ముంబై లో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్


బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదిక మీద కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉంటాయా.. అది నందమూరి బాలయ్య-జూనియర్ ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్-రామ్ చరణ్ అయినా, వెంకటేష్-రానా అయినా ఇలా ఏ బాబాయ్ - అబ్బాయ్ కలిసి కనిపించినా అభిమానులకు కన్నుల పండుగే. 

Advertisement
CJ Advs

నిన్న రామ్ చరణ్ తన భార్య ఉపాసనని తీసుకుని అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం ముంబై వెళ్లారు. నిన్న రాత్రి అనంత్ పెళ్ళిలో చరణ్-ఉపాసనలు స్పెషల్ గా కనిపించగా.. ఈరోజు శుభ్ ఆశీర్వాద్ కోసం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ముఖేష్ అంబానీ ఆహ్వానం మేరకు ముంబై వెళ్లారు. నిన్న పెళ్లి వేడుకకి మాత్రమే కాదు ఈరోజు శుభ్ ఆశీర్వాద్ లో కూడా చరణ్ దంపతులు పాల్గొన్నారు. 

అదే వేడుకకి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. అంబానీ ఇంట శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. సీఎం చంద్రబాబు తో కలిసి పవన్ కళ్యాణ్ నూతన వధూవరులని ఆశీర్వదించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన వెనుకే చరణ్ దంపతులు కలిసి నడుస్తున్న వీడియో ని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Pawan Kalyan and Ram Charan at Anant Ambani Subha Ashirwad:

Ram Charan and Family, Pawan Kalyan Jet off to Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs