Advertisement
Google Ads BL

ఐష్-అభిషేక్ మళ్ళీ డౌట్ క్రియేట్ చేసారు!!


ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే వార్త ఇప్పటిది కాదు.. కొన్నేళ్లుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు ఈ వార్తలపై ఐశ్వర్య ఇండైరెక్ట్ గా తమ ఫ్యామిలీ ఫొటోస్ తో చెక్ పెడుతుంది. అభిషేక్ బచ్చన్ సీరియస్ గా చెబుతున్నా ఈ విడాకుల రూమర్స్ మాత్రం ఆగడం లేదు. 

Advertisement
CJ Advs

కారణం కూడా ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ లే. ఇలాంటి రూమర్స్ కి ఆద్యం పోసేది వాళ్లిద్దరే. తాజాగా అంబానీ ఇంట పెళ్ళికి అమితాబ్ కుటుంబంతో సహా హాజరయ్యారు. భార్య జయ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కుమార్తె శ్వేతా బచ్చన్, ఇంకా మనవరాలు నవ్య నందా అందరూ కలిసి అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్లడమే కాదు గ్రూప్ ఫోటోకి ఫోజులిచ్చారు. ఆ పిక్ లో ఐష్ కానీ ఆమె కుమార్తె ఆరాధ్య కానీ లేరు. 

అమితాబ్ ఫ్యామిలీ వెళ్ళిపోయాక ఐశ్వర్య రాయ్ ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో సహా రెడ్ అవుట్ ఫిట్ లో బ్యూటిఫుల్ లుక్స్ తో అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. కుమార్తె తో కలిసి సింగిల్ గానే ఫొటోలకి ఫోజులివ్వడం, అభిషేక్ తండ్రి ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోవడంతో మరోమారు ఐష్-అభిషేక్ ల విడాకుల మేటర్ బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. 

ఇది ఎవరో ఊహించింది కాదు, మరెవరో కల్పించి చెప్పింది కాదు.. వారిద్దరూ కలిసి కనిపించకుండా ఇలా తండ్రి ఫ్యామిలీతో కలిసి అభిషేక్ ఒంటరిగా, కుమార్తెతో కలిసి ఐష్ ఒంటరిగా ఫొటోలకి ఫోజులివ్వడంతో మళ్లి నెటిజెన్స్ వారిద్దరి మద్యన సఖ్యతలేదు అనేలా వారు బిహేవ్ చేసారని మాట్లాడుకుంటున్నారు. 

Aish-Abhishek create doubt again!!:

Aishwarya Rai, Abhishek Bachchan Divorce Rumours Spark Again 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs