Advertisement
Google Ads BL

వల్లభనేని వంశీ కోసం వేట స్టార్ట్


టీడీపీ లో గెలిచి స్నేహితుడు కొడాలి నాని కోసం వైసీపీ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ.. గన్నవరం నుంచి పోటీ చేసి ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టమొచ్చినట్టుగా రెచ్చిపోవడమే కాదు, నారా లోకేష్ లైవ్ లో ఉండగా కొడాలి నాని, వల్లభనేని వంశీ లోకేష్ ని భయపెట్టినంతపని చేసారు.

Advertisement
CJ Advs

అంతలా వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన వంశీ.. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అడ్డంగా ఇరుక్కున్నారు. అసలు కూటమి గెలిచినా రోజు నుంచి వంశీ ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. ఎలక్షన్ రోజు టీడీపీ కార్యకర్తలపై తిరగబడిన వంశీ పై కూటమి గెలిచాక టీడీపీ కార్యకర్తలు వంశీ ఇంటిపైకి వెళ్లారు. అప్పుడు వంశీ ఇంట్లోనే ఉన్నాడంటున్నారు.

ఆ తర్వాత వంశీ ఎక్కడా కనిపించడం లేదు. యాంకర్ జాఫర్ చాలాసార్లు వంశీ ని కలిసేందుకు ప్రయత్నం చేసాడు. ఆయన లాయర్ కూడా వంశీ ఎక్కడున్నాడో చెప్పలేదు. కానీ వల్లభనేని వంశీ మాత్రం తాను తన కుమార్తె డాన్స్ కోసం అమెరికా వెళ్ళినట్టుగా చెప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ -71గా చేర్చారు.

ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించగా మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారిలో వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. వంశీ హైదరాబాద్ లో ఉంటున్నా ఎవరికీ అందుబాటులో లేరని కొంతమంది, కాదు అమెరికా వెళ్లాడని మరికొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు వంశీ వేటలో ఉన్నారు. 

The hunt for Vallabhaneni Vamsi begins:

Where is Vallabhaneni Vamsi?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs