ఆగష్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 8 పై అంచనాలు పెరిగే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యూట్యూబర్స్, సీరియల్ నటులు, ఇంకా కొంతమంది సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారంటూ వస్తోన్న వార్తలతో బుల్లితెర ప్రేక్షకుల్లో సీజన్ 8 పై ఇంట్రెస్ట్ మొదలయ్యింది.
పాపులర్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి, అలాగే కిర్రాక్ ఆర్పీ, బర్రెలక్క, అమృత ప్రణయ్ తో పాటు కుమారీ ఆంటీ కి కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ దక్కింది అంటూ వార్తలొస్తున్న వేళ.. తాజాగా గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే ఒక భామ ఈసారి హౌస్ లోకి ఎంటర్ కాబోతుంది అంటున్నారు.
బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయిన గ్లామర్ యాంకర్ వర్షిణి ఈసారి హౌస్ లో గ్లామర్ తో రచ్చ చేసేందుకు రెడీ అయ్యింది అనే మాట వినవస్తుంది. మరి నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు.