టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పెట్టిన కేసు హాట్ హాట్ గా మారిపోయింది. తనని మోసం చేశాడంటూ లావణ్య కోర్టు మెట్లెక్కింది. రాజ్ తరుణ్ మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో కలిసి తనకి అన్యాయం చేస్తున్నాడు అని, రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని ఇప్పుడు మాల్వి కోసం తనకి అవాయిడ్ చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రా తన సోదరుడితో కలిసి తనను చంపేస్తాను, రాజ్ ని వదలకపోతే ఊరుకోమని బెదిరిస్తున్నారంటూ కేసు పెట్టింది.
పోలీసులు కూడా లావణ్య అందించిన ఆధారాలతో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడిపై కేసు రిజిస్టర్ చేసారు. లావణ్య తరపు లాయర్ దిలీప్ సుంకర లావణ్యని రాజ్ తరుణ్ మోసం చేసాడు, తనకి రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు. లావణ్య ఫ్యామిలీ రాజ్ కి 70 లక్షలిచ్చింది అంటూ కేసు ఎంత స్ట్రాంగ్ అనేది చెబుతున్నాడు.
తాజాగా లావణ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి గత మూడురోజులుగా 5 కోట్లు ఇస్తామని, కేసు వాపస్ తీసుకోమని మెసేజెస్ పంపిస్తున్నారు అని, కానీ నాకు డబ్బు అక్కర్లేదు, నాకు రాజ్ కావాలి. అయినా రాజ్ ఇప్పుడు వచ్చి ప్యాచప్ చేసుకున్నా నాకు అతనితో ఉండాలి అనిపిస్తే ఉంటాను, నా మీద ఎన్నో ఆరోపణలు చేసాడు. నా మనసు ముక్కలైంది. అయినా నేను 5 కోట్లు తీసుకుని వెనకడుగు వేయను. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను అంటూ చెబుతుంది లావణ్య.