Advertisement
Google Ads BL

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో ఆర్.ఆర్.ఆర్ హావా


దర్శకధీరుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు పాటకి ఏకంగా ఆస్కార్ అవార్డు నే సొంతం చేసుకుంది. హాలీవుడ్ ప్రముఖుల సైతం ఆర్.ఆర్.ఆర్ ని పొగిడేశారు. ఇపుడు ఈ చిత్రం సౌత్ ఫిల్మ్‌ఫేర్ లోను పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి హావా చూపించింది. 

Advertisement
CJ Advs

సౌత్ లోనే అత్యంత పాపులర్ అవార్డ్స్ అయిన ఫిల్మ్‌ఫేర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సౌత్ యాక్టర్స్, సాంకేతికత నిపుణులను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వివిధ కేటగిరిల్లో ఆర్.ఆర్.ఆర్ పలు అవార్డులను సొంతం చేసుకుంది. 2023 ఏడాదిలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కొన్ని కారణాల వలన నిర్వహించకపోవడంతో ఇప్పుడు ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించారు. 

2023 సంవ‌త్స‌రానికి గాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలను సంబంధించిన సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. అందులో తెలుగులో ఆర్.ఆర్.ఆర్ చిత్రం 8 అవార్డులతో సత్తా చాటింది. అలానే సీతారామం చిత్రం 5 అవార్డులు, విరాట ప‌ర్వం 2 అవార్డులు సొంతం చేసుకున్నాయి. 

ఉత్త‌మ చిత్రం - RRR 

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి (RRR) 

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం బెస్ట్ యాక్ట‌ర్ (మేల్) 

బెస్ట్ యాక్ట‌ర్: జూనియ‌ర్ ఎన్టీఆర్ & రామ్ చ‌ర‌ణ్‌ (RRR )  

బెస్ట్ యాక్ట‌ర్ (క్రిటిక్స్) - దుల్క‌ర్ స‌ల్మాన్ (సీతారామం) 

బెస్ట్ యాక్ట‌ర్‌ (ఫీమేల్) - మృణాల్ ఠాకూర్ (సీతారామం) 

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) - సాయి ప‌ల్ల‌వి (విరాట ప‌ర్వం)

ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయ‌క్) 

ఉత్త‌మ స‌హాయ న‌టి - నందితా దాస్ (విరాట ప‌ర్వం) 

బెస్ట్ మ్యూజిక్ అల్బ‌మ్ - ఎం.ఎం. కీర‌వాణి (RRR) 

బెస్ట్ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామ శాస్త్రి (కానున్న కళ్యాణం- సీతారామం) 

బెస్ట్ ప్లేబాక్ సింగ‌ర్ (మేల్) - కాల భైర‌వ (కొమ‌రం భీముడో - RRR) 

బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్) - చిన్మ‌యి శ్రీపాద (ఓ ప్రేమా - సీతారామం) 

బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు-RRR)               

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (RRR)   

బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ - సెంథిల్‌ (RRR) & ర‌వి వర్మ‌న్‌ (పొన్నియన్ సెల్వన్)

RRR Dominates Filmfare Awards:

RRR, Sita Ramam Sweeps Filmfare Awards
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs