గత 20 ఏళ్లుగా గుడివాడలో హీరోగా తిరిగిన కొడాలి నాని.. అదే గుడివాడలో ఇప్పుడు జీరో అయ్యాడు. తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యి టీడీపీ పార్టీలో ఎమ్యెల్యేగా గెలిచి తర్వాత వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీలో ఎమ్యెల్యేగా ఆ తర్వాత మంత్రిగా పని చేసిన కొడాలి నాని నోటి దూల కొద్దిగా కాదు చాలా ఎక్కువ. ఎప్పటికి వైసీపీ ప్రభుత్వానిదే రోజులు అన్నట్టుగా ప్రతిపక్షమైన టీడీపీ వాళ్ళని ఇష్టానుసారంగా మట్లాడడం, చంద్రబాబు ని ముసలి నక్క అంటూ సంబోధించడం వంటి వాటితో బాగా ఫేమస్ అయ్యాడు.
గుడివాడలో కే కన్వెన్షన్ లోకి నేను బ్రతికుండగా చంద్రబాబు కాదు ఆడి బాబు కూడా అడుగుపెట్టలేరు అంటూ నోరుపారేసుకున్న కొడాలి నాని ఇప్పుడు గప్ చుప్ అయ్యాడు. ఓడిపోయాక కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన నాని ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. ప్రస్తుతం కొడాలి నాని వాలంటీర్లు పెట్టిన కేసుకు, బెవరేజెస్ గోడౌన్ లో లీజుదారు పెట్టిన కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు.
కానీ ఇంకా చాలా కేసులు కొడాలి కోసం కాచుకుని కూర్చున్నాయి. ముఖ్యంగా బియ్యం స్కాం నాని మెడకు చుట్టుకునేలా కనబడుతుంది. ఇంకా సరిగ్గా లోకేష్ కొడాలి నాని పై ఫోకస్ పెట్టలేదు అని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు దిగులు పడిపోతున్నారు. మరి లోకేష్ కరెక్ట్ గా కొడాలి నాని ని ఓ చూపు చూస్తే మనోడు పదేళ్లు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అని చెప్పుకుంటున్నారు.
అంతేకాదండోయ్.. ఒకప్పుడు గుడివాడలో మనల్ని కొట్టేవాడు లేదని రొమ్ము విరుచుకుని నిలబడిన కొడాలి నాని ఈరోజు గుడివాడ వీధుల్లో జీరోలా తిరగడం అటుంచి.. అసలు రాజకీయాలవైపు మట్లాడడం కానీ, మీడియాకి కూడా కను చూపుమేర కనబడకుండా తిరుగుతున్నాడు.