Advertisement
Google Ads BL

అటు కేసు ఇటు రిలీజ్ డేటు


ఒకపక్క రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి కేసు పెట్టడమే కాదు.. రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి చిత్రంలోని హీరోయిన్ మాల్వి మల్హోత్రా అలాగే ఆమె సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. A 1 గా రాజ్ తరుణ్, A 2గా మాల్వి మల్హోత్రా, A 3గా మాల్వి సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. గత వారం రోజులుగా రాజ్ తరుణ్ కేసు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Advertisement
CJ Advs

అయితే ఆ కేసు అలా కలకలం సృష్టిస్తున్న సమయంలోనే రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా జంటగా నటించిన తిరగబడరా సామి చిత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మేకర్స్. ఆగష్టు 2 న సినిమా రిలీజ్ అన్నారు. ఓ పక్క రాజ్ తరుణ్  కేసు సినిమాకి పబ్లిసిటీ అవుతుంది అని మేకర్స్ భావించారా.. ఒకవేళ లావణ్య కేసులో రాజ్ తరుణ్ అరెస్ట్ అయితే.. సినిమా ప్రమోషన్స్ ఏం కావాలి ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. 

మరి రాజ్ తరుణ్ - లావణ్య - మాల్వి మల్హోత్రాల కేసు హాట్ టాపిక్ అవడంతో అది తిరగబడరా సామి సినిమా ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుందా అనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం అయితే రాజ్ తరుణ్ లావణ్య ని మోసం చేసిన కేసులో అడ్డంగా ఇరుక్కున్నట్టే కనబడుతుంది. 

లావణ్య ఫ్యామిలీ నుంచి 70 లక్షలు రాజ్ తరుణ్ తీసుకున్నట్లుగా, లావణ్యకి అబార్షన్ కూడా అయినట్లుగా ప్రూఫ్స్ ని లావణ్య లాయర్ దిలీప్ సుంకర కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యడం తో రాజ్ తరుణ్ కి ఈ కేసు బాగా బిగుసుకున్నట్టుగానే కనబడుతుంది. చూద్దాం ఈ కేసు అతని సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది. 

Tiragabadara Saami makers set a release date:

Amidst cases, Tiragabadara Saami announces a date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs