Advertisement
Google Ads BL

ప్లీజ్.. పుట్టింటికి రా షర్మిలమ్మా!


పుట్టింటికి రావే చెల్లి.. అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. అది రీల్ అయితే ఇప్పుడు రియల్‌గా వైఎస్ జగన్ మోహన్ పరిస్థితి అంతకుమించి తయారయ్యింది..! జరిగిందేదో జరిగిపోయింది పుట్టింటికి వచ్చేయమ్మా.. చెల్లెమ్మా అంటూ ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నారట అన్నయ్య..! ఒకరా ఇద్దరా ఫ్యామిలీ అనుకున్నవాళ్లతో ఆఖరికి ఆళ్ల రామకృష్ణారెడ్డితో సైతం కబురు పంపారట. అయినా సరే తగ్గేదే లే అన్నట్లుగానే ఉందట షర్మిల. ఇలా పదే పదే అడిగేసరికి పంథానికి పోయి మరీ వైఎస్సార్ జయంతిని అలా చేయాల్సి వచ్చిందేనేది టాక్. ఇంతకీ షర్మిలను పదే  పదే ఎందుకింతలా అడుగుతున్నారు..? చెల్లికి అన్నయ్య ఇచ్చిన బంపరాఫరేంటి..? సోషల్ మీడియా వేదికగా ఏం జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

Advertisement
CJ Advs

ఇదీ అసలు సంగతి..!

వైఎస్ జగన్ జైలుకెళ్లడం తథ్యం.. కాస్త ఆలస్యం కావొచ్చేమో కానీ పోవడం మాత్రం పక్కా అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది అక్షరాలా జరిగి తీరుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. అయితే.. జగన్ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టి, క్యాడర్‌ను కాపాడుకునేది ఎవరు..? విజయమ్మ ఈ పనిచేయగలరా..? పోనీ భారతీ చేస్తారా..? అబ్బే ఈ ఇద్దరి వల్ల అస్సలు కాదు.. పట్టుమని పది నిమిషాలు మీడియా ముందుకొచ్చి మాట్లాడలేరు.. అలాంటిది అధికార పక్షాన్ని ఢీ కొట్టడం అంటే అయ్యే పనేనా..? అంటే కాదు గాక కాదు..! పోనీ వైఎస్ ఫ్యామిలీ కాకుండా వేరొకరికి బాధ్యతలు కట్టబెడితే పార్టీ ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్తుందో జగన్‌కు బాగా తెలుసు. అందుకే షర్మిలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారట.

వచ్చేయ్.. రాజీనామా చేపిస్తా!

ఇప్పటి వరకూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయ్ కదా.. వాటిని నిజం చేసి చెల్లి తిరిగొస్తే ఎంపీగా పోటీచేయించాలనే యోచనలో జగన్ ఉన్నారట. అందుకే.. దూతల ద్వారా ఈ బంపరాఫర్‌ను షర్మిలకు పంపారట. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా తాను ఎందుకు రావాలి..? రానంటే రానని తెగేసి చెప్పారట. అంతేకాదు.. ఎన్నికల్లో నేనేంటో చూపించాను కదా ఇంకా ఏం కావాలట.. ఇలా పదే పదే తనను రెచ్చగొడితే కథ వేరే ఉంటుందని గట్టిగా ఇచ్చిపడేశారట. ఇక ఆఖరికి చేసేదేమీ లేక అవినాష్‌తో రాజీనామా చేయిస్తానని.. ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయించి గెలిపించే బాధ్యత తనదేనని.. తాను జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కూడా రెక్వెస్ట్ వెళ్లిందట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎలాంటి ప్రియారిటీ ఉన్నదో ఇప్పటికీ అదే ఉంటుందని ఇది పక్కా అని జగన్ కబురు పంపాక సరే షర్మిల మాత్రం ఒకింత ఆలోచనలో పడ్డారని తెలిసింది. రాజకీయాలు కదా.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు సుమీ..!

Please.. Come to the home Sharmilamma!:

Please come Sharmila
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs