నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ ఇద్దరూ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో కాస్త ఇబ్బందిగానే కనబడుతున్నారు. దిల్ రాజు బోలెడంత ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాడు. రామ్ చరణ్ మూడేళ్ళుగా గేమ్ చెంజర్ లో ఇరుక్కుని వేరే ప్రాజెక్ట్ మీదకి వెళ్లలేదు. మరోపక్క దర్శకుడు శంకర్ ముందుగా ఇండియన్ 2 విడుదల చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ గేమ్ చేంజర్ పై బోలేడన్ని కాకపోయినా కావాల్సిన ముచ్చట్లు పంచుకుంటున్నారు. చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తవడము, ఓ పది రోజుల షూటింగ్స్ బ్యాలెన్స్ ఉండడము, అది కాగానే రిలీజ్ డేట్ ఇచ్చేస్తామని చెప్పిన శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ కాన్సెప్ట్ పై క్రేజీ కామెంట్స్ చేసారు.
గేమ్ ఛేంజర్ సినిమా తన శైలికి సంబందించిన మూవీ, ఔట్ అండ్ ఔట్ మాస్ చిత్రంగా గేమ్ చేంజర్ ఉండబోతుంది, ప్రతి ఒక్కరిని ఈ చిత్రం మెప్పిస్తుందని, గేమ్ ఛేంజర్ మూవీ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని, గేమ్ చేంజర్ మంచి పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్నట్లుగా శంకర్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
మరి శంకర్ రామ్ చరణ్ ని ఎప్పుడు చూడని ఓ డిఫ్రెంట్ కేరెక్టర్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని మెగా ఫ్యాన్స్ కి చాలా థ్రిల్లింగ్ గా ఉంది.