భారతదేశంలో నెంబర్ 1 హీరో ప్రభాస్, నెం 2 హీరో అల్లు అర్జున్. వీరిద్దరూ క్రౌడ్ పుల్లింగ్ హీరోలు, జనాలు ఏ విధంగానైనా థియేటర్స్ కి రప్పించగల సత్తా ఉన్న హీరోలు. ఈ మాటన్నది ఎవరూ అని తెగ ఆలోచిన్చేస్తున్నారేమో.. ఏపీలో నా ప్రిడిక్షన్ తప్పయితే చంద్రబాబు గెలిచి సీఎం అయినా, జగన్ ఓడి ప్రతి పక్షంలో కూర్చున్నా జాతకాలు చెప్పనని ఛాలెంజ్ చేసిన వేణు స్వామి.. ఆయన తన మాటకి కట్టుబడి చంద్రబాబు గెలిచాడనగానే సెలబ్రిటీస్ కి జాతకాలు చెప్పడం ఆపేశాడు.
కానీ ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD హిట్ అంటే ఒప్పుకోవడం లేదు. ఓ యాంకర్ ప్రభాస్ కి బాహుబలి తర్వాత అన్ని నిరాశపరిచే సినిమాలే వస్తాయన్నారు. కానీ సలార్, కల్కి రెండు హిట్ పెద్ద అయ్యాయి కదా, కల్కి బ్లాక్ బస్టర్ అనగానే.. సలార్ సూపర్ హిట్ అన్నారు, కానీ 150 కోట్లు లాస్. కల్కి కూడా అంతే. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ మూడు డిజాస్టర్స్. అప్పుడు అడగలేదు.. అప్పుడు నాకు కిరీటాలేమన్నా పెట్టారా.
సలార్, కల్కి హిట్ అయినా అది ప్రభాస్ స్టామినా వలనే. ఆయన క్రౌడ్ ఫుల్లింగ్ హీరో. కాబట్టే ఆ సినిమాలు ఆడాయి. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. నేను ప్రభాస్ ని వ్యక్తిగత విమర్శలు చేస్తే భయపడాలి. నాకు ప్రభాస్ తో పర్సనల్ గా మంచి అనుబంధం ఉంది. నా వైఫ్ ప్రభాస్ కి ఆర్గానిక్ ఫ్రూట్స్ పంపిస్తుంది అంటూ వేణు స్వామి ప్రభాస్, అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.