శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని సౌత్ లోకి తెచ్చెందుకు చాలామంది దర్శకనిర్మాతలు ట్రై చేసినా.. బాలీవుడ్ లో తనని తనకు నిరూపించుకున్నాకే సౌత్ ఎంట్రీ ఇస్తాను అని భీష్మించుకుని కూర్చున్న జాన్వీ పాపకి హిందీలో వరస సినిమాలో షాకివ్వడంతో సైలెంట్ గా సౌత్ ఆఫర్స్ ఒప్పుకోవాలని అనుకుందో లేదో.. ఆమెని పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ సినిమాల్లోకి తెచ్చేసుకున్నారు.
అటు తమిళ హీరోలు కూడా జాన్వీ కపూర్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఆమె శ్రీదేవి వారసురాలు.. సో సౌత్ లో పాపులర్ ఫిగర్ అని దర్శకనిర్మాతల నమ్మకం. అందుకే ఆమెకి బ్యాక్ టు బ్యాక్ సౌత్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. మరి జాన్వీ కపూర్ తో పాటే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సైఫ్ వారసురాలు సారా అలీ ఖాన్.. ఇప్పటికే హిందీలో ఆమేమిటో ప్రూవ్ చేసుకుంది.
అలాంటి బ్యూటిఫుల్ ఫిగర్ సారా అలీ ఖాన్ ని సౌత్ హీరోలెవరూ పట్టించుకోకపోవడం కాస్త ఆశ్చర్యమే. బాలీవుడ్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న సారా అలీ ఖాన్ ని సౌత్ లో పరిచయం చేసే హీరోలు లేరో.. లేదంటే అడిగినా ఆమె ఒప్పుకోవడం లేదో అనే సస్పెన్స్ కూడా చాలామందిలో ఉంది. మరి సారా సౌత్ ఎంట్రీ ఎప్పుడుంటుందో అనేది వేచి చూడాల్సిందే.