కొన్ని నెలల తర్వాత బక్సాఫీసు దగ్గర భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD చిత్రం విడుదలైంది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం ల దగ్గరకు వెళ్లి ఓ వారం పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు కోరగా ఏపీలో, తెలంగాణాలో రెండు రాష్ట్రల్లో కల్కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వడమే కాకుండా.. అదనపు షోస్ కి కూడా అనుమతి ఇచ్చేసారు.
కల్కి మాత్రమేనా మేము కూడా ఉన్నామంటూ భారతీయుడు 2 మేకర్స్ తెలంగాణ సీఎం కి మొరపెట్టుకోగా.. రేవంత్ రెడ్డి భారతీయుడు 2 కి కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టిప్లెక్స్ లో 75 రూపాయలు, సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చింది.
ఓ వారం పాటు తెలంగాణాలో భారతీయుడు 2కి పెరిగిన టికెట్ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రేట్లు కేవలం వారం వరకే ఉంటాయని, అలాగే ఈ పెరిగిన రేట్లు హై క్లాస్ సీట్స్ కి మాత్రమే మిగతా B, C క్లాస్ కి టికెట్ రేట్లు యదాతదమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.