కల్కి చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అన్న మేకర్స్.. వర్క్ కంప్లీట్ అవ్వని కారణంగా మే 9 కి కొత్త డేట్ ఇచ్చారు. ఆ డేట్ కూడా ఎన్నికల కారణంగా జూన్ 27 కి వెళ్లనుంది. మే 7 నుంచి జూన్ 27 వరకు కల్కి మేకర్స్ కి కావాల్సినంత సమయం దొరికింది. కానీ కల్కి ప్రమోషన్స్ పరంగా బాగా వీక్. నాగ్ అశ్విన్ ఫైనల్ కాపీ వరకు చెక్కుతూ కూర్చోవడం వలన ఆయన ప్రమోషన్స్ లో కూడా కనిపించలేదు.
ఇప్పుడు కల్కి పై వస్తున్న విమర్శలు చూసి కల్కి విడుదలకు మరొక్క నెల సమయం ఉంటే బావుండేదేమో అంటూ మట్లాడడం అందరికి షాకిచ్చింది. కల్కి 2898 AD విడుదలయ్యాక ఫస్ట్ హాఫ్ లోని లాగ్ సీన్స్ గురించి ఎక్కువగా విమర్శలు వినిపించాయి. అటు సాంగ్స్ కూడా నచ్చలేదన్నారు. మూడు గంటల నిడివి పై కూడా బోలెడన్ని విమర్శలొచ్చాయి.
తాజాగా నాగ్ అశ్విన్ కల్కి విమర్శలపై స్పందించారు. కొంతమంది కల్కి రన్ టైమ్ ని విమర్శించారు. నేను విమర్శలను పట్టించుకుంటాను. వాటిలో మనకు తెలియని విషయాలుంటాయి. కల్కి మొదటి భాగంలో పాత్రలను పరిచయం చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టింది. కొన్ని సినిమాలకు ఎడిటింగ్ కి ఎంత టైమ్ ఇచ్చినా సరిపోదు. కల్కి కి కూడా ఇంకో నెల ఉంటే బావుంటుంది అనిపించింది.
చాలామంది మహానటి తో కల్కి ని పోలుస్తున్నారు. ఆ రెండు సినిమాలు వేరు వేరు జోనర్స్. మహానటిలో ఒకే కేరెక్టర్ హైలెట్ అవుతుంది. కల్కి లో కీలక పాత్రలు చాలా ఉన్నాయి. వాళ్ల పాత్ర చుట్టూ కథ అల్లుకుపోవాలి. అందుకే కల్కి ఫస్ట్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించింది. ఏదేమైనా కల్కి చిత్రం అందరికి బాగా నచ్చింది, సెకండ్ పార్ట్ లో విమర్శలకు తావివ్వకుండా కష్టపడతామంటూ నాగ్ అశ్విన్ చెప్పుకోచ్చారు.