Advertisement
Google Ads BL

సూపర్ స్టైలిష్ అవతార్ లో శ్రీలీల


శ్రీలీల టైమ్ స్టార్ట్ అయ్యింది. నిన్నమొన్నటి వరకు శ్రీలీల పనైపోయింది అన్నవారే ఇప్పుడు ఆమె జోరుని చూసి అవాక్కవుతున్నారు. వరస వైఫల్యాలతో బాగా ఇబ్బంది పడిన శ్రీలీల కి ఇక టాలీవుడ్ లో అవకాశాలు రావు, యంగ్ హీరోలెవరూ ఆమెకి ఆఫర్స్ ఇవ్వరని మాట్లాడుకున్నారు. 

Advertisement
CJ Advs

అనుకున్నంతసేపు పట్టలేదు శ్రీలీల హావా మొదలుకావడానికి. నితిన్, రవితేజ లతో బ్యాక్ టు బ్యాక్ సెట్స్ లోకి దిగిపోయింది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలైనా, కాకపోయినా అమ్మడు ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, రవితేజ కొత్త చిత్రాల షూటింగ్స్ తో బిజీ అయ్యింది. 

ఆ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే కుర్ర హీరోలు ఎవరో ఒకరు శ్రీలీల కి ఛాన్స్ ఇవ్వకపోరు. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన లేటెస్ట్ గ్లామర్ లుక్స్ ని పోస్ట్ చేసే శ్రీలీల తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో లో వైట్ కలర్ స్పెషల్ ప్రింటెడ్ షర్ట్, జీన్ బాటమ్ తో శ్రీలీల ఫారిన్ వీధుల్లో హొయలు పోతూ కనిపించింది. హెయిర్ లీవ్ చేసుకుని, ఎంజాయ్ చేస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం శ్రీలీల  వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

Sreeleela in a super stylish avatar:

Sreeleela trendy avatar 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs