Advertisement
Google Ads BL

ఆధారాలతో అడ్డంగా బుక్కయిన రాజ్ తరుణ్


గత నాలుగైదు రోజులుగా హీరో రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లావణ్య అనే యువతి తనని రాజ్ తరుణ్ మోసం చేసాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి రాజ్ తరుణ్ పై కేసు పెట్టి మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ రాసలీలలను కథలు కథలుగా బయటపెడుతోంది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్ళ గా రిలేషన్ లో ఉన్నామని, ఇప్పుడు తన సినిమా హీరోయిన్ తో డేటింగ్ చేస్తూ తనని అవాయిడ్ చేశాడంటూ లావణ్య పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా రాజ్ తరుణ్ చేసే సినిమాల హీరోయిన్స్ తో అతని ఎఫ్ఫైర్స్ ఉన్నాయని, బిగ్ బాస్ ఫేమ్ అరియనతో రాజ్ తరుణ్ వ్యవహారం నడిపాడని, తాను అనవరసంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. అయితే పూర్తి ఆధారాలతో రాజ్ తరుణ్ విషయంలో యాక్షన్ తీసుకుంటామని పోలీసులు లావణ్యకి చెప్పారు. 

ఈలోపులో రాజ్ తరుణ్ లావణ్యపై ఆరోపణలు చేసాడు. మస్తాన్ అనే వ్యక్తి తో లావణ్య క్లోజ్ గా ఉంటుంది. నాతొ పాటుగా మస్తాన్ ని కూడా లావణ్య మోసం చేసింది, ఆమెకి నా ఇల్లు కావాలి, నేను ఆమెతో 2017 లోనే విడిపోయాను, అయినా లావణ్య నన్ను వదలడం లేదు. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయంటూ ఆమెపై తిరిగి ఫైర్ అయ్యాడు. 

ఇప్పుడు రాజ్ తరుజ్ పై పక్కా ఆధారాలతో లావణ్య పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని, నార్సింగి పోలీసులకు 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ అందించిన లావణ్య, పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని, తనని రెచ్చగొట్టి.. ఉద్దేశపూర్వకంగా తన ఆడియోలు రికార్డ్ చేశాడని చెప్పింది. 

అంతేకాకుండా మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. ఆధారాలు పరిశీలించి రాజ్ తరుణ్‌పై బిఎన్ఎస్ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల  కింద కేసు నమోదు చేసారు నార్సింగి పోలీసులు.

Raj Tarun, who was booked with evidence:

Police registered a case against Raj Tarun with solid evidence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs