మెగా ఫ్యామిలోకి చిన్న కోడలుగా వరుణ్ తేజ్ భార్యగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఈమధ్యన సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా నటనని కంటిన్యూ చేస్తున్నట్టుగా చాలా సందర్భాల్లో చెప్పిన లావణ్య ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్ కోసం వెయిటింగ్. అవి వచ్చే లోపు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తుంది.
తాజాగా లావణ్య త్రిపాఠి స్టైలిష్ ఫోటోని షేర్ చేసింది. వైట్ కలర్ ప్యాంట్.. టీషర్ట్ ధరించి వాల్ సపోర్ట్ తో నించుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోతో పాటుగా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తెలివైన శిర్షికలు అన్నీ అయిపోతున్నాయని అంటూ రాసుకొచ్చింది. ఇక లావణ్యకి తెలుగులో అవకాశాలు లేకపోయినా.. తమిళనాట ఒకటో అర అవకాశాలైతే వస్తున్నాయి.
తమిళనాట తానల్ అనే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం విడుదల కోసం లావణ్య త్రిపాఠి వెయిటింగ్.