మంచు మోహన్ బాబు ఫ్యామిలిలో ఇంకా అగ్గి ఆరలేదా, అసలు మంచు బ్రదర్స్ మద్యన ఏం జరుగుతుంది. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్యలో మొదలైన గొడవలు సమసిపోలేదా. అసలు మోహన్ బాబు ఫ్యామిలిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇదే నెటిజెన్స్ మాట్లాడుకుంటున్న మాటలు. మంచు విష్ణు కి మనోజ్ కి మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.
గొడవలకు కారణాలు ఏమో కానీ.. మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్న సందర్భంలోను విష్ణు అంటీముట్టనట్టుగా కనిపించాడు. ఆ తర్వాత మంచు విష్ణు తన వాళ్లపై దౌర్జన్యం చేసినట్లుగా మనోజ్ ఒక వీడియో వదిలాడు. విష్ణు తో సంబంధం లేకుండా మనోజ్ తన పెళ్లిని అక్క లక్ష్మి ఇంట్లో చేసుకున్నాడు. ఆ తర్వాత మంచు విష్ణు-మనోజ్ కలిసిన సందర్భం కూడా కనిపించలేదు.
తాజాగా మరోసారి మంచు బ్రదర్స్ మధ్యలో లుకలుకలు బయటకి కనిపించేలా జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో రకరకాల అనుమానాలకు తావిచ్చింది. నిన్న మంచు మనోజ్-మౌనికలు తమ కుమార్తెకి నామకరణ మహోత్సవాన్ని సింపుల్ గానే చేసినా.. దానికి మోహన్ బాబు-ఆయన భార్య, ఇంకా భూమా మౌనిక అక్క అఖిల్ ప్రియా మరికొంత మంది బంధువులు హాజరయ్యారు.
కానీ ఈ వేడుకలో మంచు విష్ణు కానీ ఆయన భార్యకాని పిల్లలు కాని ఎవ్వరూ కనిపించలేదు. దానితో మరోసారి మంచు బ్రదర్స్ గొడవలు ఆగలేదు అంటూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. మరి మంచు విష్ణు-మనోజ్ ల మద్యన మంట నిజంగానే చల్లారలేదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.