Advertisement

రాజకీయాలకు బై బై చెప్పనున్న కొడాలి నాని ?


వైసీపీ ప్రభుత్వంలో బూతు మంత్రిగా పేరు పొందిన గుడివాడ మాజీ మంత్రి, ప్రస్తుత మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న న్యూస్. జగన్ వెంట్రుక పీకలేరు, అసెంబ్లీ గేటు దాటనివ్వము, జగన్ ముందు మీరెంత, చంద్రబాబు ఓ ముసలోడు, లోకేష్ పప్పు, పవన్ కళ్యాణ్ ఏం పీకుతాడు అంటూ మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు.

Advertisement

పెట్టుకోండి కేసులు, ఏం చేస్తారు అంటూ ఓడిపోయాక కూడా మేకపోతు గాంభీర్యం చూపించిన కొడాలి నాని జగన్ కి అండగా నిలబడతాడుకుంటే ఇప్పుడు తనపై పెట్టబోయే కేసులకు భయపడి రాజకీయ సన్యాయం తీసుకుంటున్నాడా? లేదంటే చంద్రబాబు ఓడిపోకపోతే నేను రాజకీయాలొదిలేస్తాను, ఆడి బూట్లు తుడుస్తానని అన్నందుకు మాట మీద నిలబడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడా అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న.

ఇప్పటికే పలువురు వాలంటీర్లు కొడాలి పై కేసులు పెట్టారు. ఆ విషయంలో హై కోర్టు తీర్పుతో కొడాలికి కాస్త ఊరట లభించింది. ఇప్పుడు అవే కాదు మరిన్ని కేసులు కొడాలి నాని పై పడుతున్నాయి, ఇక లోకేష్ పూర్తిగా కొడాలి నాని పై ఫోకస్ చెయ్యలేదు, చంద్రబాబు తన దృష్టి నాని పై పెట్టలేదు.. పెడితే నాని కి మూడినట్లే.. ఈలోపే రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తే ఏ గోల లేదు అనుకుంటున్నాడో, ఏమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కొడాలి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అంటే అది కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ లకు భయపడే రాజకీయాలొదిలేసాడని అందరూ హేళన చెయ్యడం పక్కా. అయితే అది నిజమా, కాదా అనేది తెలియాల్సి ఉంది. 

Is Kodali Nani going to say goodbye to politics?:

Kodali Nani Permanent Goodbye to Politics?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement