వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ లా చెలరేగిపోయి అసెంబ్లీలో, మీటింగ్స్ లో ప్రతిపక్షాలపై ఇష్టమొచ్చినట్టుగా రెచ్చిపోయి వెటకారాలాడే రోజా ఇప్పుడు మారింది అంటున్నారు. మినిస్టర్ అయ్యాక నగరి లో కన్ను మిన్ను కానకుండా వైసీపీ కేడర్ ని పట్టించుకోని రోజా ఇప్పుడు అందరిని కలుపుకుపోయేలా చూస్తుంది అని వైసీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో ఓడిపోయాక ఋషి కొండ భవనాల విషయంలో జగన్ ని వెనకేసుకొచ్చిన ఈ మాజీ మంత్రి గారు ఆ తర్వాత అంతగా రాజకీయాల్లో కనిపించడం లేదు. రీసెంట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ కోసం చెన్నై వెళ్లొచ్చిన రోజా నిన్న వైస్సార్ జయంతి రోజున నగరిలో కేక్ కట్ చేసి హడావిడి చేసింది. అంతేకాదు గతంలోలా ఫైర్ బ్రాండ్ మాదిరి మాట్లాడడం లేదు.
రోజా మాటల తీరు మారింది, మాట తీరు హుందాగా ఉందంటూ సొంతపార్టీ నేతలు అభినందిస్తున్నారు. వైస్సార్ మాదిరి పాలనే జగన్ అందించారని, అదే పాలన మళ్లీ కావాలని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పిన రోజా రాజన్న పాలన మళ్లీ రావాలని, రాజన్న బిడ్డ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు దూరమయ్యేలా అందరం కలసికట్టుగా పనిచేయాలని రోజా కార్యకర్తలకి పిలుపునిచ్చింది.
మరి ప్రభుత్వంపై కానీ, వేరే ఇతర విషయాలపై కానీ రోజా మాట్లాడకుండా ఇలా పార్టీ పరమైన అంశాలతో ముగించడం చూసిన వారు రోజాలో చాలా మార్పొచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు.