Advertisement
Google Ads BL

కల్కి ఆట ముగిసింది-ఇండియన్ 2 ఆట స్టార్ట్


కల్కి 2898 AD ఆట ఆల్మోస్ట్ ముగిసినట్టే. కల్కి ఇప్పటికి 900 కోట్లు కొల్లగొట్టి 1000 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేందుకు రెడీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టామినా, లోకనాయకుడు కమల్ క్రేజ్, అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్ర హైలెట్ అవడం అన్ని కల్కి ని 1000 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేలా చేసింది. కల్కి విడుదలై పది రోజులు పైనే అయ్యింది

Advertisement
CJ Advs

ఇక కల్కి హడావిడి ముగుస్తూ ఉంది.. మరోపక్క ఇండియన్ 2 అదేనండి భారతీయుడు 2 హడావిడి మొదలైపోయింది. రేపు శుక్రవారం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 చిత్రం పై భీభత్సమైన అంచనాలు, కమల్-శంకర్ కాంబో రిపీట్ అవడమే కాదు.. బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా రావడం అన్ని ఈ చిత్రం పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

మరోపక్క ఇండియన్ 2 ప్రమోషన్స్ ని కమల్ అండ్ టీమ్ పిచ్చెక్కించేస్తోంది. ముంబై, చెన్నై,హైదరాబాద్ మలేషియా అంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడం చేస్తుంది ఇండియన్ 2 టీం. మరి కల్కి తో ఊపొచ్చిన థియేటర్స్ కి ఇప్పుడు ఇండియన్ 2 తో మరింత కలర్ ఫుల్ గా మారబోతున్నాయి.

లోకనాయకుడు కమల్ హాసన్ మటించిన భారీ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కల్కి లో విలన్ గా కనిపించిన కమల్ ఇండియన్ 2 లో సేనాపతిగా దున్నేయ్యడానికి రెడీగా ఉన్నారు. 

Kalki game over-Indian 2 game start:

Bharateeyudu 2 releasing this friday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs