Advertisement
Google Ads BL

ప్రభాస్ స్పిరిట్ లో కొరియన్ స్టార్?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD సక్సెస్ ని ఆస్వాదిస్తూ ఇటలీలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి విడుదలకు ముందే ప్రభాస్ సైలెంట్ గా ఇటలీకి చెక్కేశారు. ఇక ఇటలీ నుంచి రాగానే ప్రభాస్ మారుతి దర్శత్వంలో చేస్తున్న రాజా సాబ్ సెట్స్ కి వెళతారని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

మరోపక్క ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా చేస్తారట. ఇక రాజా సాబ్, సలార్ 2 పూర్తి కాగానే ప్రభాస్ హను రాఘవపూడి మూవీని సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ తో ప్రభాస్ స్పిరిట్ లైన్ లో ఉంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ ని పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సందీప్ రెడ్డి ఎప్పుడో రివీల్ చేసేసాడు. అయితే తాజాగా స్పిరిట్ కోసం సందీప్ బిగ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ కి విలన్ గా ఓ కొరియన్ యాక్టర్ ని తీసుకు రావాలనుకుంటున్నాడట. స్పిరిట్ మూవీలో విలన్‌గా కొరియన్ యాక్టర్ మా డాంగ్ సియోక్ ని ప్రభాస్ కోసం సందీప్ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడంటున్నారు.  

స్పిరిట్ మూవీని పాన్ ఇండియా గా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు సందీప్ వంగా ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. మరి ప్రభాస్‌కు ధీటుగా పవర్‌ఫుల్ విలన్‌గా స్పిరిట్ మూవీలో ఈ కొరియన్ యాక్టర్ కనిపిస్తాడని ప్రచారం జోరుగా మొదలైంది. 

Korean star in Prabhas Spirit?:

Korean superstar to join the star cast of Prabhas Spirit?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs