వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలై అపుడే నెల రోజు గడిచిపోయింది. గత ఐదేళ్లుగా వైసీపీ ఏపీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సూన్యం, అది తెలుసుకున్నారో లేదంటే చంద్రబాబు సూపర్ సిక్స్ కి ఆకర్షితులయ్యారో తెలియదు కానీ ఏపీ ప్రజలు మూకుమ్మడిగా కూటమికి ఓట్లేసి వైసీపీ నేతలకి ఆల్మోస్ట్ చుక్కలు చూపించారు. వై నాట్ 175 అన్న జగన్ కి 11 మంది ఎమ్యెల్యేలతో సరిపెట్టుకోమన్నారు.
వైసీపీ ఓటమి బాధ ఒకవైపు, మరోవైపు తాము ఓడిపోయింది జగన్ వల్లే. మా నియోజకవర్గాలకు ఎలాంటి నిధులు కేటాయించలేదు, జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్లే ఓడిపోయాము.. అంటూ వైసీపీ నేతలు జగన్ పై నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వైసీపీ ఓటమిపై స్పందిస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతి ఒక్కొక్క వైసీపీ నేత జగన్ వల్లే ఓడిపోయామంటూ, మేము చేసిన తప్పిదాల వలనే ప్రజలు మమ్మల్ని ఓడించారంటూ మీడియా ముందు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
తాజాగా చోడవరం మాజీ ఎమ్మెల్యే, ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా జగన్ తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తాను ఎన్నోసార్లు జగన్ కు విన్నవించానని, కానీ జగన్ పట్టించుకోలేదని అందుకే మేము ఓడిపోయామంటూ కరణం ధర్మశ్రీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నేను దాదాపుగా రెండు కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి నా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశాను. తెలిసో.. తెలియకో మేము చేసిన తప్పుల వల్ల ప్రజలు తమను అధికారానికి దూరం చేశారన్నారు. జగన్ చేసిన తప్పిదాలే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమంటూ కరణం ధర్మశ్రీ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది.