పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కలయికలో జూన్ 27 న విడుదలైన కల్కి చిత్రం కలెక్షన్స్ పరంగా రికార్డులను సృష్టిస్తుంది. విడుదలైన ప్రతి ఏరియాలో బ్రేక్ ఈవెన్ చేరుకోవడమే కాదు.. కల్కి 2898 AD చిత్రం రికార్డులు పరంగా కొత్త నెంబర్లని నోట్ చేస్తుంది. ప్రతి ఏరియాలో ప్రతి థియేటర్ దగ్గర కల్కి ప్రభంజనం సృష్టిస్తుంది.
మొదట్లో కల్కి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత సెలబ్రిటీస్ ఇచ్చిన టాక్ తో కలెక్షన్స్ పుంజుకున్నాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో కల్కి చిత్రం ఇప్పుడు 800 మార్క్ ని టచ్ చేసింది. ఈ వీకెండ్ లో కల్కి కలెక్షన్స్ 1000 కోట్లు కొల్లగొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఈరోజుకి కల్కి విడుదలై తొమ్మిది రోజులు.
తొమ్మిది రోజుల్లో కల్కి 800 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్లుగా మేకర్స్ స్పెషల్ గా పోస్టర్ విడుదల చెయ్యడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సలార్, కల్కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రభాస్ దూసుకుపోవడం ఆయన అభిమానులకి ఎనలేని ఉత్సాహాన్ని, ఎనర్జీని ఇచ్చింది. ప్రస్తుతం కల్కి కలక్షన్స్ ప్రభంజనం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అని అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.