బాలీవుడ్ టాప్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెన్సీపై చాలా రకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఆమెది ఫేక్ ప్రెగ్నెన్సీ, దీపికా-రణవీర్ సింగ్ లు సరోగసి ద్వారా బిడ్డని కంటున్నారు. కానీ ఇప్పుడు దీపికా ప్రెగ్నెంట్ అని చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి దీపికా చాలాసార్లు చెక్ పెట్టింది.
రీసెంట్ గానే కల్కి 2898 AD ప్రెస్ మీట్లో దీపికా పదుకొనె బేబీ బంప్ తో కనిపించడమే కాదు ప్రెగ్నెన్సీ కళ మొహం లో కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అయితే ఆ ఈవెంట్ లో దీపికా పదుకొనె హై హీల్స్ వేసుకోవడంపైనా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇక దీపికా డెలివరీ టైమ్ దగ్గర పడుతుంది. దానితో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది.
తాజాగా దీపికా పదుకొనె శారీ లో కనిపించింది. అది కూడా బేబీ బంప్ తో దీపికా పదుకొనె డిజైనర్ శారీ లో చేయించుకున్న ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పర్పుల్ కలర్ డిజైనర్ శారీలో మెడలో సింపుల్ గా ముత్యాల చోకర్ తో దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటో షూట్ చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. దీపికా తల్లయ్యే క్షణాల కోసం వారు వెయిట్ చేస్తున్నారు.