జాన్వీ కపూర్ కాస్తా ఇప్పుడు సౌత్ లో దేవర బ్యూటీగా మారిపోయింది. దేవర సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్ధమవుతుండగా.. జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ మూవీ అందులోను గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో జోడి కట్టడంతో జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు హిట్ అందుకోలేని జాన్వీ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ విషయంలో విపరీతంగా ఫేమస్ అయ్యింది.
రకరకాల మోడ్రెన్ డ్రెస్సులతో జాన్వీ కపూర్ అందాలు ఆరబొయ్యడంలో దిట్ట. ఏ డ్రెస్సులో ఎంత అందం చూపించాలనేది జాన్వీ కపూర్ కి ఓ లెక్క ఉంటుంది. తాజాగా ఆమె ముంబైలో ఓ ఈవెంట్ కి హాజరైంది. ఆ ఈవెంట్ కి బ్యూటిఫుల్ డ్రెస్సులో అచ్చం బాపు బొమ్మలా కనిపించింది. మోడ్రెన్ డ్రెస్, మోడ్రెన్ లుక్ అయినా ఆమె లోని సాంప్రదాయ లుక్ కొట్టొచ్చినట్టుగా కనిపించింది.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర షూటింగ్ చేస్తుంది. మరోపక్క మరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో RC 16 సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా కనిపిస్తుంది.