Advertisement
Google Ads BL

ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ కోరిక తీరేనా?


మరొక్క వారం రోజుల్లో మెగా అభిమానులు రిలాక్స్ అవుతారు. వారు పడుతున్న ఆందోళన ఓ కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెర పడుతుంది. ఎలా అనుకుంటున్నారా.. ఇండియన్ 2 రిలీజ్ అవుతుంది కదా.. జులై 12 న కమల్ హాసన్-శంకర్ ల ఇండియన్ 2 రిలీజ్ అయితే కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్  డేట్ పై ఓ క్లారిటీ రాదు.

Advertisement
CJ Advs

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 విడుదలయ్యాక గేమ్ చేంజర్ కి సంబంధించి కొద్దిపాటి షూటింగ్ ఉంది అది ఫినిష్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేసి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేస్తామని చెప్పడంతో ఆ ఇండియన్ 2 రిలీజ్ కోసం మెగా అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణాలు దగ్గర పడుతున్నాయని తెలిసి వారు రిలాక్స్ మోడ్ లోకి వెళుతున్నారు.

మూడేళ్ళుగా గేమ్ చేంజర్ షూటింగ్ జరుపుకోవడం మాత్రమే కాదు రిలీజ్ డేట్ విషయంలో మెగా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెర పడుతుంది అందుకే వారు హ్యాపీ గా ఫీలవుతున్నారు. ప్రస్తుతం శంకర్ గేమ్ చేంజర్ ని పక్కనపెట్టి ఇండియన్ 2 ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

Will mega fans still get their wish?:

Game Changer update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs