Advertisement

మళ్ళీ మొదటికి.. వైఎస్ జగన్ రాజీనామా!


వైసీపీ మళ్ళీ మొదటికి వస్తుందా..? తొలినాళ్లలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ మాత్రమే గెలిచి ఒకరు అసెంబ్లీకి, ఇంకొకరు పార్లమెంటుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాటి సీన్ 2024లో రిపీట్ కాబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదెలాగంటే.. త్వరలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. ఇది జరగకపోయినా ఎంపీ అరెస్ట్ అవొచ్చని అప్పుడిక ఉప ఎన్నికలు ఉంటాయ్.. అనే వార్తలు ఏపీ రాజకీయాల్లో తెగ నడుస్తున్నాయి.

Advertisement

ఓహ్.. ఇదా అసలు కథ..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలైన వైసీపీ.. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. అంతే ఇంచు మించి పార్టీని జీరో నుంచి పైకి లేపాల్సిందే. ఎంత ఓటు శాతం ఉన్నప్పటికీ ఈ ఐదేళ్లు కార్యకర్తలు. నేతలను.. అన్నింటికీ మించి తనను తాను జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇప్పట్లో జాతీయ స్థాయిలో తనకు అండ కావాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి తోడు వైఎస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు సైతం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అలా అవినాష్ రాజీనామా చేస్తే.. ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేసి.. పార్లమెంట్‌కు వెళ్లబోతున్నారని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చూపుతున్నారని మూడు నాలుగు రోజులుగా వైసీపీలో పెద్ద చర్చే జరుగుతోంది.

అమ్మకే ఛాయిస్..!

వైఎస్ జగన్ తొలుత పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసే ఎంపీగా పోటీ చేస్తారని.. ఇక ఎమ్మెల్యేగా తల్లి విజయమ్మ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఒకవేళ సోదరి వైఎస్ షర్మిల మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే మాత్రం.. ఆమెను ఒప్పించి పోటీ చేయించే బాధ్యత తల్లికే అప్పగించారని తెలియవచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు గనుక.. జాతీయ స్థాయిలో అందరి దృష్టిలో పడాలని అవసరమైతే ఇండియా కూటమితో స్నేహానికి వెనుకాడకుండా.. గతం మరిచి ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరీ ఇంతలా..?

ఐతే.. అబ్బే జగన్ రెడ్డికి ఆ అవసరం అస్సలు లేదని.. ఎందుకంటే ఇప్పట్లో ఏపీలో క్యాడర్ ను కాపాడుకొని.. ఐదేళ్లు ఇక్కడ ప్రజల్లో తిరిగితే తప్ప 2029 ఎన్నికల్లో కూటమిని ఢీ కొట్టడం కష్టమని సొంత పార్టీ నేతలే చెపుతున్నారు. అసలే ఐదేళ్లు లేనిపోని కష్టాలు, నష్టాలు ఉంటాయని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయినా.. వైసీపీ గళం, జాతీయ స్థాయిలో తాను ఏంటో నిరూపించుకోవడానికి నలుగురు లోక్ సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళను కాదని.. అంతకు మించి జగన్ చేసేది ఏముంది చెప్పండి. సో.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనిపై వైసీపీ నుంచి ఫుల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.

Again, YS Jagan resignation!:

Jagan as MP, Vijayamma as MLA?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement