Advertisement

ఉస్తాద్ ఆగిపోయిందా? హరీష్ ట్వీట్ వైరల్


ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తన విధులని సక్రంగా నిర్వహించాలనే తపనతో కనిపిస్తున్నారు. అలాగే అధికారులతో పని చేయించుకుంటూ పిఠాపురం వాస్తవ్యుడిగా మారిపోయినట్లుగా చాటి చెప్పేందుకు అక్కడ 3.5 ఎకరాల ల్యాండ్ కొనడం చర్చనీయాంశం అయ్యింది. మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ని చూసుకుని ప్రతిరోజు పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Advertisement

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ సినిమాల విషయంలో మరోమూడు నెలల వరకు ఏమి చెప్పలేనని అంటున్నారు. తాను ఇక్కడ ఇంత పని వదిలేసి సినిమాల వైపు వెళ్లి OG అంటే క్యాజీ అంటారు ప్రజలు అంటూ సినిమాల కోసం మూడు నెలలు టైమ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల వైపు వచ్చినా ఆయన సగంలో ఆపేసిన OG, హరి హర వీరమల్లు పూర్తి చేస్తారు.

కానీ హరీష్ శంకర్ తో చెయ్యాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ ని పవన్ కళ్యాణ్ ఆపేస్తారు. ఇక ఆ చిత్రం షూటింగ్ మొదలు కాదనే ప్రచారం జోరుగా జరుగుతుంది. చాలా కొద్దిరోజులు మాత్రమే షూట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ని పవన్ ఆపెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియా లో రకరాలుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు హరీష్ శంకర్ ఆ రూమర్స్ కి ఓ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

అసలు పవన్ కళ్యాణ్ తో హరీష్ సినిమా అన్నప్పుడే పవన్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసారు. అన్నిటికి హరీష్ స్పదించారు. ఇప్పుడు కూడా సినిమా ఆగిపోతుంది అనే రూమర్స్ కి స్పందిస్తూ..  సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు ఇప్పుడు రూమర్స్ చదివే టైమ్ కూడా లేదు.. అంటూ హరీష్ శంకర్ ఈ రూమర్స్ ని పట్టించుకోను అని చెప్పకనే చెప్పాడు. మరి ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నట్టా? లేనట్టా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక హరీష్ ట్వీట్ కి కొంతమంది ఇలా రిప్లై ఇచ్చారు.. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండాలి అంటే సినిమాపై ఏడ్చిన ప్రతి ఒక్కరు భయపడేలాగా, అనవసరంగా ఏడ్చాము అని బాధపడేలాగా ఉండాలి.ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని మరొక రెండు, మూడు దశాబ్దాలు సినిమా గురించి చెప్పుకునేలాగా ఉండాలి.మీడియా, సోషల్ మీడియా షేక్ అయ్యేలాగా, రికార్డ్స్ తిరగరాసేలాగా ఉండాలి.. అంటూ రిప్లై ఇస్తున్నారు. 

Director Harish Shankar Latest Tweet Goes Viral:

Ustaad Bhagath Singh Director Harish Shankar Latest Tweet Goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement