రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 11 ఏళ్లగా రిలేషన్ లో ఉన్నాము, ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలోని హీరోయిన్ కోసం తనని వదిలేసాడు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసు విషయంలో రాజ్ తరుణ్ తన వెర్షన్ వినిపించాడు.
లావణ్య విషయంలో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని.. గత రాత్రి తన తల్లి తలకు నూనె పెట్టిందని, ఉదయం నిద్ర లేవగానే ఈ విషయం తెలిసిందని, దాంతో స్నానం కూడా చేయకుండానే వివరణ ఇస్తున్నానని చెబుతూ.. ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజంలేదని, లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి 2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు.
ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ, మరే ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కానీ, లావణ్య తనను బెదిరిస్తుండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించారు. లావణ్య వాళ్ళని గోవా తీసుకెళ్ళినప్పుడు వాళ్లకు అక్కడ డ్రగ్స్ తీసుకున్నా.. తాను మాత్రం డ్రగ్స్ జోలికే వెళ్లలేదని, నాకు డ్రగ్స్ అలవాటు లేదన్న విషయం కాలర్ ఎగరేసి మరీ చెబుతానని చెబుతున్నాడు.
అంతేకాకుండా కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రాకు, తనకు లింకు పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైనా రాజ్ తరుణ్ స్పందించాడు. మాల్వీ మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని, లావణ్య ఎన్ని అబద్ధాలైనా చెబుతుందని, ఆమె ఏమైనా చెబుతుందని మండిపడ్డారు. మాల్వీ మల్హోత్రా సినిమా షూటింగ్ లకు హైదరాబాద్ వస్తే ఆమెకు నేనెందుకు ఆశ్రయం కల్పిస్తాను? అని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. లావణ్యకు తన డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో రియాక్ట్ అయ్యాడు.