ప్రస్తుతం 11 మంది ఎమ్యెల్యేలతో జగన్ నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నారు. ఆయన పులివెందుల వెళ్లి అక్కడ కాస్త హడావిడి చేసి బెంగుళూరు ప్యాలెస్ కి వెళ్లి పదిరోజుల పాటు సేదతీరుతూ పార్టీ పరంగా ఎలాగైనా కోలుకోవాలాంటూ ముందుగా ఈవీఎం బాక్స్ లు పగలగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లిని పరామర్శించి వచ్చాక చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.
మంచి చేసాం అయినా ప్రజలు వైసీపీ ని ఓడించారంటున్న జగన్ నెల్లూరులో పార్టీని వీడి వెళ్లిపోయేవారిని నిలువరించే ఆలోచన కూడా చెయ్యనని చేతులెత్తేశారు. వెళ్ళేవాళ్ళని వెళ్లనివ్వండి, నేను ఆపను, మీరు కూడా ఆపొద్దు. వాళ్ళు ఎంత పెద్ద నేతలైనా వెళ్లాలనుకుంటే వెళ్ళిపోనివ్వండి, ఇక్కడో కాలు, అక్కడో కాలు వేసే వాళ్ళని ఆపొద్దు. నాకు వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ జగన్ చేతులెత్తెయ్యడం వైసీపీ కేడర్ ని నిరాశలోకి నెట్టేస్తుంది.
నెల్లూరు పర్యటనకు వెళ్లిన జగన్ కి ఇక్కడ నేతలు, కార్యకర్తలు టీడీపీ లో చేరిపోతున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పార్టీ పరిస్తితి బాలేదు అంటూ జగన్ దగ్గర గోడు వెళ్లబోసుకుంటే.. అదేం ఉండదు, నేను వాళ్లతో మాట్లాడతాను, సర్ది చెబుతాను అనాల్సింది పోయి.. వెళితే వెళ్లనివ్వండి, వెళ్ళేవాళ్ళని ఆపను, మీరు ఆపొద్దు, వారిని పిలిచి బ్రతిమలాల్సిన అవసరం లేదు అంటూ జగన్ మట్లాడడం విడ్డురమే.
అసలే 11మంది ఎమ్యెల్యే లలో ఎప్పుడు ఎవ్వరు వెళ్ళిపోతారో అని భయపడాల్సిన జగన్ ఇలా మట్లాడడం వైసీపీ కేడర్ ని అయోమయంలోకి నెట్టేసింది.