Advertisement
Google Ads BL

కల్కి.. కల్కి.. కల్కి..


కల్కి.. కల్కి.. కల్కి.. 

Advertisement
CJ Advs

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..  

దేశమంతటా ఇదే పేరు మారుమోగుతోంది.. 

ప్రతి రోజు బాక్సాఫీసు ప్రతిధ్వని వినిపిస్తోంది.. 

కళ తప్పిన థియేటర్లను మళ్ళీ మిల మిలా మెరిసేలా చేసిన కల్కి విడుదలైన రోజు నుంచి వీర విహారం చేస్తున్నాడు. విజయాన్ని విస్తరించుకుంటూ వెళుతున్నాడు. అంచనాలకు మించిన కలెక్షన్స్, అస్సలు ఊహించని రికార్డులు సొంతం చేసుకుంటూ.. బాక్సాఫీసు బరిలో దుమ్ముదులిపేస్తున్నాడు. రిలీజయ్యి పది రోజులవుతున్నా ప్రతి చోటా, ప్రతి ఆట నాదేనంటూ ఎక్కడికక్కడ లెక్కలకందని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్న కల్కి ఇప్పటికే 700 కోట్ల మార్కుని దాటేశాడు. ఏ స్థాయికి చేరతాడో మనల్నే వేచి చూడమంటున్నాడు. 

కల్కి సాధించిన ఇంతటి ఘాన విజయం మరీ ముఖ్యంగా కల్కి చిత్రాన్ని ముగించిన విధానం కల్కి 2 పై అంచనాలను 100 రేట్లు పెంచేసాయి. సుప్రీం యాస్కీన్ అంటూ కమల్ పాత్రతో ఇన్నోవెన్స్ చూపించి, అశ్వద్ధామ గా అమితాబ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, సుమతిగా దీపికా పాత్ర తో ఇంటెన్సిటీ రప్పించి కల్కి కథని కదం తొక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ పోషించిన భైరవ కేరెక్టర్ ని వేరియస్ యాంగిల్స్ లో స్క్రీన్ పై చూపించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో కర్ణ బ్లాక్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. అలాగే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు అతిధి పాత్రల్లో కనిపించి అలరించినా అర్జునుడిగా విల్లు ఎక్కు పెట్టిన విజయ్ దేవరకొండ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్ట్ 2 లో తన పాత్ర పరిధి ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అని వినిపిస్తోంది. అలాగే ఈ మొదటి భాగం మొత్తం మీద కేవలం ఏడు నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ రెండో భాగంలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతారని తెలుస్తోంది. 

ఇక అసలు విషయానికొస్తే ఓ వైపు కల్కి హావా ఉదృతంగా కొనసాగుతూ ఉండగానే కల్కి 2 పై నిర్మాత అశ్విని దత్ స్పందించారు. ఇప్పటికే రెండో భాగానికి సంబందించిన కొంత భాగం షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యిందని, ఖచ్చితంగా 2025 లోనే కల్కి 2 రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే అంశాన్ని ధ్రువీకరిస్తూ వచ్చే ఏడాదే కల్కి 2 వస్తుందని కన్ ఫర్మ్ చేసేసారు. ప్రొడక్షన్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కల్కి 2 కోసం ప్రభాస్ కేవలం 55 రోజులు, కమల్ 45 రోజులు, అమితాబ్ 30 రోజులు మాత్రమే కేటాయించాల్సి ఉంది. దీపికకి సంబదించిన మేజర్ పోర్షన్ ఆల్రెడీ షూట్ చేసేసారట. ఆమె సుమారుగా మరో పది పదిహేను రోజులు కేటాయిస్తే చాలట.. (అది కూడా డెలివరీ తర్వాత). ఇక ఇందులోనూ మరికొన్ని కొత్త పాత్రాలు గమ్మత్తయిన గెస్ట్ అప్పీరియన్సులు ఉండబోతున్నాయి. ఆ వివరాలు మరో అప్ డేట్ లో.. 

కల్కి 2898 AD నే తమకు బాగా కలిసొచ్చిన డేట్ మే 9 రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు అశ్విని దత్ కానీ.. ఎలక్షన్స్ అడ్డొచ్చాయి. పరిస్థితులు మారిపోయాయి. అందుకే వాయిదా పడ్డ కల్కి కాస్త లేట్ గా వచ్చినా, మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించినా కలక్షన్స్ విషయంలో మాత్రం దున్నేస్తుంది. ఈ నేపథ్యంలో కల్కి 2 ని 2025 లోనే తెస్తామని ప్రకటించిన మేకర్స్ మే 9 అనే డేట్ ని స్ట్రాంగ్ గా లాక్ చేసుకున్నారని సమాచారం. అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ కి జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు మహానటి వంటి మరపురాని విజయాలను అందించిన సెంటిమెంట్ డేట్ అది. అదే డేట్ కి కల్కి 2 తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారట అశ్విని దత్. అందుకు సహకరించే దిశగా అడుగులు వేస్తున్నారట అల్లుడు నాగ్ అశ్విన్. 

Kalki.. Kalki.. Kalki.. :

Kalki 2 release locked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs