నిన్న ఎయిర్ పోర్ట్ లో ప్రాణ స్నేహితులైన సూపర్ స్టార్ రజినీకాంత్-మోహన్ బాబులు కలిసి నడుస్తూ మాట్లాడుకోవడం చూసిన వాళ్లంతా చాలా అబ్బురపడ్డారు. వీరి స్నేహం ప్రపంచానికి తెలుసు. అయినా వీరు కలిసి కనిపిస్తే చాలు మైమరిచిపోతారు. సూపర్ స్టార్ రజినీకాంత్-మోహన్ బాబు స్నేహం ఈనాటిది కాదు ఎన్నో ఏళ్ళ స్నేహం వీరిది.
ఒకరింటికి ఒకరు చనువుగా వెళ్లగలిగే ఆత్మీయ అనుబంధం వీరిది. సూపర్ స్టార్ హైదరాబాద్ వచ్చారంటే మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా, ఆయన ఆదిత్యం స్వీకరించకుండా రారు. ఇక నిన్న శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ కనిపించిన ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఈరోజు ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుని కనిపించారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం... అంటూ మోహన్ బాబు తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అద్భుతమైన పిక్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఫ్లైట్ లో ఇరువురు పక్క పక్కనే కాదు ఏంతో ఆత్మీయంగా ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని కనిపించగా.. పిక్ ఆఫ్ ద డే, రజిని, మోహ బాబు ఎంతగా ప్రాణ స్నేహితులో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.