గత పదిరోజులుగా బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న జగన్ మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారో.. లేదంటే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటున్నారో కానీ.. పది రోజులుగా జగన్ మోహన్ రెడ్డి అలికిడి సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇక్కడ అసెంబ్లీలో ఒక్కరోజు కనిపించి మాయమై పులివెందులలో తేలిన జగన్ అక్కడి నుంచి అటే బెంగుళూరు ప్యాలెస్ కి చెక్కేసిన విషయం తెలిసిందే.
పది రోజులుగా సైలెంట్ గా కూర్చున్న జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు కి వారింగ్ ఇచ్చెయ్యగానే.. బాబు భయపడిపోవాలట. జగన్ బాబు కి వార్నింగ్ ఇవ్వడం చూసిన జనాలు అబ్బ జగన్ నిద్ర లేచాడే అంటూ కామెంట్ చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు ఓటమి విషయంలో ఎమ్యెల్యేలతో, మాజీలతో చర్చించిన జగన్ నేడు పిన్నేల్లిని జైలులో కలిసి ప్రెస్ మీట్ కి వచ్చాడు.
ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టినందుకు కాదు పదిరోజుల తర్వాత అతని పై హత్యాయత్నం కేసు పెడతారా, పిన్నెల్లి తప్పు లేదు అనడానికి ఈ బెయిల్ లే ఉదాహరణ.. ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు. ఇదే మాదిరి కొనసాగితే.. గనక రేపు అదే రిపీట్ అవుతుంది. భవిష్యత్తులో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మీ ప్రభుత్వం ఓడిపోయి మా ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్ష సాధింపు చర్యలే ఉంటాయి.. ఇదే చంద్రబాబుకి నా వార్నింగ్ అంటూ జగన్ వీరావేశంతో మాట్లాడాడు.
జగన్ లో మార్పు చూసిన వైసీపీ కార్య కర్తలు సోషల్ మీడియాలో జగనన్న వచ్చాడు, చంద్రబాబు కి ఇక చుక్కలే, అధైర్యం చూడండిరా అని సంతోషపడుతుంటే.. హా వచ్చాడమ్మా ఇన్నాళ్ళకి, ఇప్పుడు నిద్ర లేచాడు మీ జగన్, సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒక నేరస్థుడిని పట్టుకుని ఇట్టా డిఫెండ్ చేస్తున్నాడేంటి? అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తూ టీడీపీ వాళ్ళు బిజీగా కనిపిస్తున్నారు.