నగరి ప్రజల్లోనే కాదు, నగరి వైస్సార్సీపీ పార్టీలో మాజీ మినిస్టర్ రోజాపై ఎంత వ్యతిరేఖత ఉందొ.. ఆమెపై శ్రీవారి వీఐపీ దర్శనాల విషయంలో ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అనేది 2024 ఎన్నికల్లో ఆమె ఓటమితోనే తేలిపోయింది. మినిస్టర్ కాక ముందు బుల్లితెరపై జబర్దస్త్ షోకి కొన్నేళ్లుగా జెడ్జ్ స్థానాల్లో ఉన్న రోజా పై అక్కడి కమెడియన్స్ కి ప్రత్యేక అభిమానం.
2024 వరకు ఆ అభిమానం పదిలంగానే ఉంది. కానీ 2024 ఎన్నికల్లో ఒకొనొక సమయంలో రోజా vs జబర్దస్త్ కమెడియన్స్ అన్న రేంజ్ లో మాటల యుద్ధమే నడిచింది. జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది జనసేన తరపున నిలబడి ప్రచారం చేసారు. దానితో రోజా వారిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చెయ్యడంతో ఆమెకి జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది యాంటీ అయ్యారు.
మాజీ జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ అయితే రోజాపై చేసిన, చేస్తున్న ఆరోపణలు కామెంట్స్ వింటే రోజా అభిమానులకి దుఃఖం పొంగుకొస్తుంది. మరికొంతమంది అంటే రాకింగ్ రాజేష్ లాంటి వాళ్ళు ఎన్నికల ముందు రోజాకి సపోర్ట్ చెయ్యడం మానేసి ఓడిపోయాక సపోర్ట్ చేసి సోషల్ మీడియా లో మీమర్స్ కి దొరికిపోతున్నారు. రాకింగ్ రాజేష్ ఈ మధ్యన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోజా పై తిరుపతి వీఐపీ దర్శనాలు విషయంలో ఆరోపణలు చేస్తున్నారు.. అసలు దాని వెనుక నిజమేమిటంటే రోజమ్మ చేయిపట్టుకుని కొంతమందికైనా వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శనం దొరుకుతుంది అని రోజా అలా చేసారు అందులో తప్పేముంది అంటూ మాట్లాడాడు.
దానితో రాకింగ్ రాజేష్ ని సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు. ఏంటేంటీ.. రోజా తో మరికొంతమంది వీఐపీ దర్శనం ద్వారా స్వామివారి దర్శన భాగ్యందక్కుతుందా.. ఏం చెప్పావన్నా అంటూ రాజేష్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆరోపణలని కాదు.. రోజా మినిస్టర్ అయ్యాక ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వెళ్లిందో అనేది ఆ వేంకటేశ్వరుడు కూడా లెక్కేసి ఉండడేమో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.