Advertisement
Google Ads BL

చరణ్, ఉపాసన మాట నిలబెట్టుకున్నారు


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు మరోసారి తమది గోల్డెన్ హార్ట్‌ అని నిరూపించుకున్నారు. ఇప్పటికే పలు సందర్భాలలో వారి గొప్ప మనసు ఏంటో అందరికీ తెలిసింది. ఇప్పుడు మరోసారి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, దాదాపు 500కి పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ హామీని నెరవేర్చారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జానీ మాస్టర్ ట్విట్టర్ ఎక్స్‌లో ఏం పోస్ట్ చేశారంటే..

Advertisement
CJ Advs

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏

నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.

అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవిగారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.

నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యూనియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.

అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.

మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను 🙏

Again Ram Charan and Upasana Golden Heart Revealed:

Ram Charan and Upasana Helps Dancers Union  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs