Advertisement
Google Ads BL

OG అంటే.. క్యాజీ అంటారేమో..


ఏపీ ఎన్నికలలో గెలిచి, డిప్యూటీ సీఎంగానే కాకుండా కొన్ని శాఖలకు మంత్రిగానూ పదవిని చేపట్టిన జనసేన అధినేత.. గెలిచిన తర్వాత తొలిసారి, తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. బుధవారం ఆయన వారాహి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో అభిమానులు సినిమాల ప్రస్తావన తెచ్చి ఓజీ ఓజీ అని అరుస్తుంటే.. ఓజీ సినిమా గురించే కాకుండా.. తన సినిమా షూటింగ్స్‌పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓజీనా.. నాకు సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? ఎలాగూ నిర్మాతలకు మాట ఇచ్చాను కాబట్టి.. ముందు ఒక మూడు నెలలు ఇక్కడ వర్క్ చేయాలి. కనీసం రోడ్డుకు గుంతలు కూడా పూడ్చలేదు అని నన్ను తిట్టుకోకూడదు కదా. గ్రామాలకు కొత్త రోడ్లు కంటే ముందు ఉన్న గుంతలైనా పూడ్చాలి. లేదంటే, మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వెళ్లి ఓజీ ఓజీ ఏంటి అని క్యాజీ అంటే నేనేం చెప్పను. ఆ భయంతోనే.. నిర్మాతలకు కూడా కాస్త నన్ను క్షమించాలి అని చెప్పాను. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాస్త సేవ చేసుకుని.. కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులో, మూడు రోజులో ఎక్కడా పనికి అంతరాయం రాకుండా షూటింగ్ చేస్తానని చెప్పాను. ఓజీ చూద్దురుగాని బాగుంటుంది.. అని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ఓజీ గురించి, సినిమాల గురించి మాట్లాడుతుంటే.. అభిమానులు, జనసైనికులు ఈలలతో మోత మోగించారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం త్వరలోనే ఆయన షూటింగ్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి.

Pawan Kalyan Reacted on His Movies Shootings at Pithapuram:

AP Deputy CM Pawan Kalyan Sensational Comments on His Movie Shootings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs