Advertisement
Google Ads BL

హీరో, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, ఎక్స్‌లెంట్ వైఫ్


విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు F2, F3 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలలో వెంకీతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా మరో హీరోగా యాక్ట్ చేశారు. ఇప్పుడు సోలోగా వెంకీతోనే అనిల్ రావిపూడి ఓ సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు, అనిల్ రావిపూడి F సిరీస్ సినిమాలకు సంబంధం లేదు కానీ.. ఈ సినిమాను నిర్మిస్తోంది కూడా ఆ సినిమాలను నిర్మించిన సంస్థే కావడం విశేషం.

Advertisement
CJ Advs

విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సైంధవ్’గా వచ్చి సక్సెస్ కొట్టలేకపోయారు. ఇప్పుడీ సినిమాపై భారీగా ఆయన హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ కాంబినేషన్‌కు దిల్ రాజు కూడా యాడ్ అవడం, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్‌తో ఈసారి కచ్చితంగా వెంకీ బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడనే సంకేతాలను ఇచ్చేలా.. గ్రాండ్‌గా ఈ సినిమాని మొదలెట్టారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ మూవీ హీరో, అతని ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ అని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 58వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

Victory Venkatesh and Anil Ravipudi Film Launched:

Sri Venkateswara Creations Production No 58 Launched Splendidly  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs