ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజండ్స్ వంటి మేకర్స్, నటులు ఉన్నా కూడా బాలీవుడ్ నిలదొక్కుకోలేకపోతుంది. అందుకు కారణం ఏమటనేది పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో కాస్త బాలీవుడ్ పరువు నిలబడిందంటే మాత్రం అందుకు కారణం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అనే చెప్పుకోవాలి. పఠాన్, జవాన్ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌తో బాలీవుడ్‌ని పడిపోనియకుండా నిలబెట్టాడు బాద్‌షా. అంతేకాదు, షారుఖ్‌కు చెందిన ఐపీఎల్ టీమ్ ఈ ఏడాది విన్నర్‌గా నిలవడం కూడా షారుఖ్ స్టామినాని తెలియజేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్న షారుఖ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఏంటది అనుకుంటున్నారా?
స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు షారుఖ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ ఏడాది జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫారుక్ ఖాన్‌ను ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ సత్కారంతో పాటు.. షారుఖ్ సినిమాల్లో క్లాసికల్ హిట్‌గా నిలిచిన దేవదాసు సినిమాను ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నారు. నిజంగా ఇది అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో షారుక్ లాంటి దిగ్గజ నటుడిని సత్కరించుకోవాలనే కోరిక తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా, నటుడిగా భారతీయ సినిమా ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసిన షారుక్‌ను సత్కరించడం మా గౌరవం.. అని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్విట్జర్లాండ్‌లో ఆగస్ట్ 7 నుంచి 17వ తేదీ వరకు జరగనుండగా..ఆగస్ట్ 10న షారుఖ్‌ను సత్కార కార్యక్రమం జరగనుంది.